Multibagger: సముద్రమంత లాభాలు.. రూ.1.20 లక్షలను రూ.2 కోట్లుగా మార్చిన స్టాక్.
Multibagger Stock: ఈ మధ్య కాలంలో ఐపీవోలుగా వచ్చిన కంపెనీలు సైతం తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్లను సంపన్నులను చేస్తున్నాయి. లక్షలను కోట్లుగా మార్చేసి మల్టీబ్యాగర్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది లాన్సర్ కంటైనర్ లైన్స్ మల్టీబ్యాగర్ గురించే. 2016లో ఐపీవోగా వచ్చిన ఈ లాజిస్టిక్స్ సేవల సంస్థ తన ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చింది. ఐపీవో సమయంలో షేర్ ధర రూ.12 వద్ద BSE SME ఎక్స్ఛేంజ్ లిస్ట్ అయ్యింది. గడచిన 6 ఏళ్లలో కంపెనీ షేర్లు విపరీతమైన రాబడిని అందించాయి.

ప్రస్తుతం షేర్ విలువ..
కేవలం రూ.12 వద్ద ప్రారంభమైన స్టాక్ ధర ప్రయాణం.. రూ.500 లు దాటింది. ఈ రోజు స్టాక్ మార్కెట్లో మధ్యాహ్నం 2.18 సమయంలో 487 వద్ద ట్రేడ్ అవుతోంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.508 దగ్గర ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.176.60 వద్ద ఉంది. ఈ స్మాల్ క్యాప్ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన నాటి నుంచి రెండు సార్లు తన పెట్టుబడిదారులకు ఉచిత షేర్లను బోనస్ గా అందించింది.

బోనస్ వివరాలు..
2011లో వ్యాపారాన్ని ప్రారంభించిన లాన్సర్ కంటైనర్ లైన్స్ షేర్లు మార్చి 2016లో రూ.12 ఇష్యూ ధరకు వచ్చి రూ. 12.60 వద్ద లిస్ట్ అయ్యాయి. 6 ఏళ్ల కాలంలో కంపెనీ రెండుసార్లు బోనస్ షేర్లను ఇచ్చింది. జనవరి 3, 2018 3:5 నిష్పత్తిలో, ఆ తర్వాత అక్టోబర్ 13, 2021లో 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇచ్చింది. లిస్టింగ్ సమయంలో ఒక్కో లాట్ కు 10000 షేర్లను కంపెనీ అందించింది.

ఐపీవోలో ఒక్క లాట్ కొంటే..
IPOలో 10000 అందుకున్న ఇన్వెస్టర్లకు మెుదటి సారి బోనస్ సమయంలో 3:5 బోనస్ తర్వాత షేర్ల సంఖ్య 16000 చేరుకుంది. అలాగే పెట్టుబడిని కొనసాగించినవారికి రెండోసారి 2021లో కంపెనీ బోనస్ షేర్లను 2:1 నిష్పత్తిలో ప్రకటించటం వల్ల వాటి సంఖ్య 16000 నుంచి 48000కు చేరుకుంది. అలా దీర్ఘకాల పెట్టుబడిదారులకు షేర్ల సంఖ్య దాదాపు ఐదు రెట్లు పెరిగింది.

లక్షలు కోట్లుగా..
అంటే ఐపీవో సమయంలో రూ.1.20 లక్షలు పెట్టుబడిగా పెట్టిన వారికి నవంబర్ 7, 2022న షేర్ ధర రూ.508 ప్రకారం ఏకంగా రూ.2.42 కోట్లకు చేరుకుంది. ఇదే క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ధర రూ.487.45 ప్రకారం ఆ పెట్టుబడి విలువ రూ.2.33 కోట్లుగా ఉంది. అంటే దీర్ఘకాలంలో పెట్టుబడులను కొనసాగించే వారికి ఎల్లప్పుడూ మంచి లాభాలు వస్తాయని ఈ స్మాల్ క్యాప్ స్టాక్ నిరూపించింది.

కంపెనీ వ్యాపారం..
భారతదేశంలో షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ గా లాన్సర్ కంటైనర్ లైన్స్ లిమిటెడ్ ఉంది. కంపెనీ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సిస్ దేశాలకు లైనర్ సేవలను అందించే షిప్పింగ్ ఏజెన్సీ హౌస్. ప్రాజెక్ట్ & ఫ్రైట్ ఫార్వార్డింగ్, కంటైనర్ ట్రేడింగ్ & లీడింగ్ వంటి షిప్పింగ్, షిప్పింగ్-సంబంధిత సేవలను కూడా కంపెనీ అందిస్తోంది. కంపెనీలకు అవసరమైన అన్ని షిప్పింగ్ అవసరాలను తీర్చుతూ ఎండ్-టు-ఎండ్ లాజిస్టిక్ సొల్యూషన్‌లను అందిస్తోంది.


Click it and Unblock the Notifications