Lalithaa Jewellery: వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా తన వ్యాపారాన్ని లలితా జ్యూవెలర్స్ యజమాని కిరణ్ కుమార్ ''డబ్బులు ఎవరికి ఊరికే రావు'' అనే ఒక్క డైలాగుతో ఫేమస్ అయ్యారు. మార్కెట్లోని ఇతరుల కంటే తక్కువకు బంగారం అందిస్తున్నట్లు, కంపేర్ చేసిమరీ కొనాలని ఆయన సూచిస్తూ అగ్ర జ్యూవెలర్ బ్రాండ్ బిల్డ్ చేశారు.
మీడియాలో తనదైన శైలిలో యాడ్స్ చేస్తూ పసిడి ప్రియులను ఆకట్టుకోవటంలో ఆయనకు మించిన వ్యక్తి ఉండరన్నది వాస్తవం. మార్కెట్లో మిగిలిన బంగారపు షాపులతో పోలిస్తే లలితా జువెల్లరీ షాపుల్లో తక్కువ ధర ఉంటేనే బంగారం కొనండి అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరటం నమ్మకాన్ని పెంచింది. అలా అతి తక్కువ కాలంలోనే తనకంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కొత్త స్టోర్లను ఏర్పాటు చేస్తూ వేగంగా తన బిజినెస్ విస్తరణను కొనసాగిస్తున్నారు.

లలితా జువెల్లరీ అంటే ప్రజల్లో నమ్మకాన్ని పెంచారు. అయితే అలాంటి కిరణ్ కుమార్ జీఎస్టీ లెక్కల విషయంలో అడ్డంగా దొరికిపోయారు. లలిత జువెల్లరీ జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లెక్కల్లో జరిగిన తప్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జువెల్లరీ 2017-18 సంవత్సరానికి జీఎస్టీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో రూ.56.61 కోట్లను క్లెయిమ్ చేసింది. అయితే సంస్థ సమర్పించిన లెక్కల్లో మాత్రం ఇది రూ.41.22 కోట్లు రావాలని ఉంది.
ఇక్కడ జీఎస్టీ అధికారుల నుంచి వాస్తవానికి రావాల్సన అమౌంట్‌కంటే రూ.15.39 కోట్లు ఎక్కువ పొందినట్లు లెక్కల్లో తేలింది. ఇయర్ ఎండింగ్ లెక్కల్లో లలితా జువెల్లరీ తప్పుడు లెక్కలు బయటపడటంతో స్టేట్ కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటులోని జీఎస్టీ విభాగం అధికారులు సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో లలిత జువెల్లరీ సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్ వివరాలను ఇవ్వాల్సిందిగా CAG (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) సైతం ఆదేశాలు జారీ చేసింది. చివరికి రావాల్సినదాని కంటే రూ.15.39 కోట్లు ఎక్కువ సంస్థ పొందినట్లు అధికారులు తేల్చారు. దీనిలో రూ.14.85 కోట్ల కంపెనీ నుంచి రికవర్ అయినట్లు జీఎస్టీ అధికారులు వెల్లడించారు. మిగిలిపోయిన రూ.53.52 లక్షలకు సంబంధించి డిపార్టుమెంటు అధికారులు ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదని తన నివేదికలో కాగ్ పేర్కొంది. డబ్బులు ఊరికే రావు... అంటూ ప్రజలకు చెప్పే సంస్థ ఇలా చేయటం ఏంటి అంటూ ఇది తెలిసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications