మరో బ్యాంకు సంక్షోభంలో పడింది! లక్ష్మీ విలాస్ బ్యాంకులో(LVB) సంక్షోభం ముదిరింది. ఏడుగురు డైరెక్టర్ల నియామకాన్ని వాటాదారులు తిరస్కరించినట్లు ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో LVB తెలిపింది. తిరస్కరణకు గురైన నియామకాల్లో మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ సుందర్‌తో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్, స్వతంత్రేతర డైరెక్టర్లు కేఆర్ ప్రదీప్, రఘురాజ్ గుజ్జర్, నాన్ ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర డైరెక్టర్లు బీకే మంజునాథ్, జీ జగన్మోహన్ రావు, వైఎన్ లక్ష్మీనారాయణ మూర్తి ఉన్నారు.
ఈ నియామకాలకు సెప్టెంబర్ 25వ తేదీన జరిగిన వార్షిక సమావేశంలో ఓటింగ్ జరిగింది. ద్రవ్యలభ్యత పరిస్థితి సౌకర్యవంతంగానే ఉందని డిపాజిటర్లకు బ్యాంకు హామీ ఇచ్చింది.

ఆర్బీఐ కమిటీ
ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) లక్ష్మీ విలాస్ బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించేందుకు డైరెక్టర్స్ కమిటీని ఎంపిక చేసింది. ఎండీ, సీఈవో ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తారు. కాగా, లక్ష్మీ విలాస్ బ్యాంకు సంక్షభం నేపథ్యంలో సోమవారం స్టాక్స్ భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఓ సమయంలో ఈ షేర్ ధర 6 శాతం నష్టపోయింది. ఆర్బీఐ జోక్యం అనంతరం కోలుకొని 1 శాతం కంటే దిగువ నష్టానికి చేరుకుంది.

విలీనం కోసం క్లిక్స్ గ్రూప్‌తో చర్చలు
బ్యాంకు మూలధనం కోసం ప్రయత్నాలు చేస్తోంది. విలీనం కోసం క్లిక్స్ గ్రూప్‌తో చర్చలు జరుపుతోంది. ఇలాంటి సమయంలో సంక్షోభం తెరపైకి వచ్చింది. బ్యాంకు మూలధన సమృద్ధి నిష్పత్తి(CAR), బాసెల్ III మార్గదర్శకాల ప్రకారం జూన్ 30వ తేదీ నాటికి 0.17 శాతానికి కుదించారు. రెగ్యులేటరీ కనిష్టం 10.875 శాతానికి భిన్నంగా ఉంది. జూన్ క్వార్టర్‌లో బ్యాంకు నికర నష్టం రూ.112 కోట్లకు పైగా ఉంది.
గత ఏడాది ఇదే కాలంలో రూ.237 కోట్లకు పైగా నష్టం వచ్చింది. LVB క్లిక్స్ గ్రూప్‌తో చర్చలు జరుపుతోంది. అయితే కరోనా కారణంగా ఆలస్యం కావొచ్చునని జూలై 30వ తేదీన LVB తెలిపింది. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ప్రత్యేక కాలాన్ని పొడిగించేందుకు ఇరుపార్టీలు అంగీకరించాయి. సెప్టెంబర్ 27 నాటికి లిక్విడిటీ కవరేజీ రేషియా (LCR) 262 శాతంగా ఉంది.

తగ్గిన డిపాజిట్లు
జూన్ క్వార్టర్ నాటికి ఈ బ్యాంకులో డిపాజిట్లు రూ.21,162 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 27 శాతం క్షీణించాయి. అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే 1.3 శాతం క్షీణించింది. అయితే ఇఫ్పుడు డైరెక్టర్ల నియామకాన్ని వాటాదారులు తిరస్కరించడంతో ఈ బ్యాంకులో సంక్షోభం ముదిరింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications