మహిళకు దిగ్గజ TVS గ్రూప్ పగ్గాలు .. ఇంతకు ఎవరీ లక్ష్మీ వేణు..? పూర్తి వివరాలు
TVS Motors: ఇటీవలి కాలంలో దేశంలోని చాలా మంది దిగ్గజ వ్యాపారవేత్తలు తమ సామ్రాజ్యాలను నవతరం చేతికి అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా TVS గ్రూప్ అధినేత వేణు శ్రీనివాసన్ టాప్ మేనేజ్‌మెంట్‌లో రెండు ప్రధాన మార్పులు చేపట్టారు. ఇది కంపెనీని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లటంలో భాగంగా మార్పులు చోటుచేసుకున్నాయి.
కంపెనీలో కుమారుడు, కుమార్తెకు కీలక నిర్వహణ బాధ్యతలను ఇచ్చారు టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్. భారత కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన, ఉన్నత విద్యావంతులు, ప్రతిభావంతులైన కార్పొరేట్ నాయకుల్లో లక్ష్మీ వేణు కూడా ఒకరు. లక్ష్మీ వేణు ప్రఖ్యాత యేల్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్. అలాగే వార్విక్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు.

ప్రస్తుతం లక్ష్మీ వేణు TVS గ్రూప్‌కి చెందిన సుందరం క్లేటన్(SCL)కి అధిపతిగా ఉన్నారు. సుందరం క్లేటన్ అంతర్జాతీయ మార్కెట్‌లోకి విస్తరించడానికి లక్ష్మీ వేణు కీలక పాత్ర పోషించారు. అలాగే అమెరికాలో సుందరం క్లేటన్ ఫౌండ్రీని స్థాపించడంలో ఆమెది కీలక భూమిక. ఈ క్రమంలో ఇటీవలే టీవీఎస్ గ్రూప్ ఆటో విడిభాగాల తయారీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా లక్ష్మీ వేణు పదోన్నతి పొందారు.
ఈ క్రమంలో ప్రఖ్యాత సంస్థలైన వోల్వో, కమిన్స్, హ్యుందాయ్, ప్యాకర్ అండ్ డైమ్లర్ వంటి ప్రముఖ కంపెనీలతో వ్యాపార సంబంధాలను మెరుగుపరచటంలో లక్ష్మీ కీలక పాత్ర పోషించారు. అలా ఆమె రాకతో కంపెనీ లాభాలు సైతం అనేక రెట్లు పెరిగాయి. గణాంకాలను పరిశీలిస్తే 2021లో కేవలం రూ.75.84 కోట్లుగా ఉన్న నికల లాభం.. 2022లో రూ.2,276 కోట్లకు పెరిగింది.
ఆటోమొబైల్ పరిశ్రమలో మహిళా లీడర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. లక్ష్మీ వేణు తల్లి మల్లికా శ్రీనివాసన్ ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. ఆమె ట్రాక్టర్లు, ఫార్మ్ ఉత్పత్తులను తయారుచేసే TAFE గ్రూప్‌ను ఒంటరిగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీ వేణు TAFE మోటార్స్ అండ్ ట్రాక్టర్స్ లిమిటెడ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు.


Click it and Unblock the Notifications