ఉద్యోగం కోల్పోయినప్పుడు దాని బాధ కేవలం వ్యక్తికే కాకుండా మొత్తం కుటుంబానికీ తాకుతుంది. ఒక్కసారిగా ఉద్యోగం పోయిందనే షాక్‌తో, ప్రతిరోజూ రాత్రిళ్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎంతోమంది. "ఈ నెల EMI ఎలా కట్టాలి? ఇంటి అద్దె, పిల్లల చదువుల ఖర్చులు ఎలా తీరుస్తాం?" అన్న ఆలోచనలతో కుటుంబమంతా ఆందోళనలో మునిగిపోతుంది. కొత్తగా ఉద్యోగం దొరకాలనే ఆశ ఒక్కటే ఉంటుంది.

2025లో టెక్ రంగం తీవ్రమైన లేఅాఫ్‌ల దెబ్బ తిన్నది. ప్రతీ వారం, కొత్త కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న వార్తలు వస్తున్నాయి. ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి పెద్ద టెక్ దిగ్గజాలు "ఎఫిషియెన్సీ" పేరుతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద పెట్టుబడులు పెంచుతూ, వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి.
ఈ లేఅాఫ్‌ల ప్రభావం ఉద్యోగుల జీవితాలపై గట్టిగానే పడుతోంది. మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, భవిష్యత్తుపై అస్పష్టత అన్నీ కలసి చాలా మందిని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.
ఇటీవల X (Twitter) లో వెల్త్ విస్పరర్ అనే యూజర్ ఒక నిజమైన సంఘటనను పంచుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తన కజిన్ భర్త బెంగళూరులో ఒక పెద్ద ఇల్లు కొన్నాడు. దాదాపు రూ. 1.3 కోట్ల విలువైన ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి ఆయన రూ. 50 లక్షల వరకు డౌన్‌పేమెంట్ చేసి, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లోన్ ద్వారా తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రతి నెలా సుమారు రూ. 78,000 EMI కట్టడం ఆయన జీవనశైలిలో ఒక ప్రధాన భాగమైపోయింది. ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ఈ భారాన్ని తేలికగా మోయగలిగారు, ఆయన మైక్రోసాఫ్ట్‌లో మంచి జీతం వచ్చే ఉద్యోగం చేసే దాకా కానీ అనుకోని పరిణామం ఆయన జీవితాన్ని తారుమారు చేసింది.
ఇటీవల లేఅాఫ్‌లో భాగంగా ఆయన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఒక్కసారిగా వచ్చిన ఈ దెబ్బతో నెల నెలా చెల్లించాల్సిన భారీ EMI భారం ఆయనపై పడి, కొత్త ఉద్యోగం కోసం ఆరాటపడుతూనే కుటుంబాన్ని చూసుకోవాల్సిన కఠిన పరిస్థితిలోకి ఆయన నెట్టబడ్డారు. ఇల్లు కోల్పోతామనే భయం, రోజువారీ ఖర్చులు నిర్వహించడంలో ఉన్న ఇబ్బందులు, భవిష్యత్తు అస్పష్టత ఇలా అన్నీ కలిసిపోయి ఆయన జీవితాన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయని ఆమె వేదనతో వివరించారు.
ఈ పోస్ట్‌కి అనేక మంది స్పందించారు.
ఒకరు ఇలా రాశారు "వయసు 35-40లోపే ఉంటే Microsoft అనుభవంతో మరో ఉద్యోగం దొరుకుతుంది. కానీ వయసు 45 దాటితే, పైగా పిల్లలు టీనేజ్‌లో ఉంటే, పరిస్థితి కష్టమవుతుంది. ఎక్కువ ప్లానింగ్ అవసరం ఉంటుంది."
మరో యూజర్ ఇలా రాశారు "ఉద్యోగం ఉన్నప్పుడు EMI మేనేజబుల్గా అనిపిస్తుంది. కానీ జాబ్ పోతే అది భయంకరమైన భారమైపోతుంది. అందుకే డ్రీమ్ హౌస్ కంటే ఎమర్జెన్సీ ఫండ్ చాలా ముఖ్యం."
CA నితిన్ కౌశిక్ కూడా తన స్నేహితుడి అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన 2021లో పుణెలో రూ. 95 లక్షల విలువైన ఒక ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఆ ఇల్లు కోసం ముందుగా రూ. 35 లక్షలు డౌన్ పేమెంట్‌గా చెల్లించారు. మిగతా మొత్తాన్ని తీర్చడానికి రూ. 60 లక్షల రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఆ రుణానికి ఆయన ప్రతి నెలా రూ. 52,000 EMI చెల్లిస్తున్నారు. ఇది వచ్చే 20 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. పైగా రుణంపై 8.5% వడ్డీ ఉండటం వల్ల, ఆయనకు ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగింది.
కానీ ఆయన కూడా తాజాగా ఉద్యోగం కోల్పోయారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం, EMIలు కట్టడం, రెండింటినీ మేనేజ్ చేయడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆయన మాటల్లో "ఇల్లు కొనడం సులభం. కానీ ఆ ఇల్లు కాపాడుకోవడం ముఖ్యంగా ఆర్థిక మాంద్యంలో అసలు చాలెంజ్."
ఇదిలా ఉంటే, Oracle కూడా భారత్‌లో భారీ స్థాయిలో లేఅాఫ్‌లు చేసింది. దాదాపు 10% ఉద్యోగులు ప్రభావితమయ్యారు. కంపెనీ రీస్ట్రక్చరింగ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. AI ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడులు పెంచడానికే Oracle ఈ చర్యలు చేపట్టింది.
ఇప్పటికిప్పుడు కొత్త ఉద్యోగం దొరకడం చాలా కష్టమైన విషయం. ఉద్యోగ మార్కెట్‌లో పోటీ తీవ్రమైన స్థాయిలో ఉండటంతో, అదే రంగంలో కొత్త అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారు ఎక్కువకాలం నిరుద్యోగిగా ఉండే పరిస్థితిని ఎదుర్కొంటారు.
అంతేకాదు, కొత్త ఉద్యోగం దొరికినా పాత జీతం స్థాయిలో కాకుండా తక్కువ జీతంతోనే ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫలితంగా, ఇప్పటికే ఉన్న ఆర్థిక సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ క్రమంలో ఉద్యోగం పోయిన షాక్‌తో పాటు భవిష్యత్తుపై భయం, కుటుంబంపై ఉన్న బాధ్యతలు, స్నేహితులు-బంధువుల ముందు అవమానం అన్నీ కలసి మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఇలా ఒకేసారి ఆర్థిక కష్టాలు, భావోద్వేగ భారం ఎదురవ్వడం వల్ల ఉద్యోగం కోల్పోయినవారి జీవితం మరింత కఠినంగా మారుతుంది.
మొత్తానికి, టెక్ రంగంలో లేఅాఫ్‌లు ఉద్యోగుల జీవన విధానాలను గట్టిగా కుదిపేస్తున్నాయి. EMIలు, అప్పులు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కలిసి మధ్యతరగతి ఉద్యోగుల భుజాలపై భారంగా మోపుతున్నాయి.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications