ఉద్యోగం పోయిన 45 రోజుల్లోనే రిమోట్ జాబ్.. టెక్కీ షేర్ చేసిన సక్సెస్ సీక్రెట్ ఇదే!

ప్రస్తుతం గ్లోబల్ ఐటీ మార్కెట్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను తీసేస్తుండటంతో ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రొబేషన్ పీరియడ్‌లోనే ఉద్యోగం కోల్పోయి, చేతిలో రూపాయి ఆదాయం లేక తీవ్ర నిరాశలో కూరుకుపోయిన ఒక భారతీయ సాఫ్ట్‌వేర్ డెవలపర్.. కేవలం 1.5 నెలల్లోనే సరికొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ (Remote Job) సంపాదించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

తాను ఎదుర్కొన్న కష్టాలు, ఉద్యోగం సాధించడానికి ఉపయోగించిన అద్భుతమైన స్ట్రాటజీలను అతడు రెడిట్ ఫోరమ్‌లో షేర్ చేయగా, ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ (trending) అవుతోంది. పాత జీతం కంటే 30 శాతం తక్కువ ప్యాకేజీకే ఒప్పుకున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉద్యోగం తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అతడు పేర్కొన్నాడు. మరి ఇంత తక్కువ టైమ్‌లో అతడు జాబ్ ఎలా కొట్టాడో చూద్దాం.

Laid Off Techie Lands Remote Job In 45 Days Shares Powerful Interview Strategies Viral Reddit Post

ఉద్యోగం కోసం ఓన్లీ టెక్నాలజీ ప్లాన్!

సాధారణ పద్ధతిలో కాకుండా ఈ టెక్కీ ఉద్యోగ అన్వేషణ కోసం ఒక సరికొత్త ప్లాన్ వేశాడు. లింక్డ్‌ఇన్, నౌకరీ, ఇన్‌స్టాహైర్ (Instahyre), వెల్‌ఫౌండ్ లాంటి ప్లాట్‌ఫారమ్‌ల నుండి ప్రతి 4 గంటలకొకసారి కొత్త ఉద్యోగాల వివరాలను సేకరించేలా ఒక 'కస్టమ్ జాబ్ స్క్రాపర్' (సాఫ్ట్‌వేర్ టూల్) బిల్డ్ చేశాడు. దీనివల్ల ఎక్కడ ఖాళీలు ఉన్నా వెంటనే తెలిసిపోయేది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతిరోజు వరుసగా అప్లై చేస్తూనే ఉన్నాడు.

అప్లై చేయడమే కాకుండా లింక్డ్‌ఇన్ ద్వారా సదరు కంపెనీల హెచ్ఆర్ (HR) మేనేజర్లకు డైరెక్ట్ మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపేవాడు. చాలా మంది స్పందించకపోయినా, కొందరు మాత్రం ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేయడానికి ఈ పద్ధతి హెల్ప్ అయిందని చెప్పాడు.

ఇంటర్వ్యూల గురించి షాకింగ్ నిజాలు!

ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనగానే చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కంగారు పడిపోతుంటారు. కానీ, ఈ టెక్కీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు..

  • DSA అంత కష్టం కాదు: డేటా స్ట్రక్చర్స్ & అల్గారిథమ్స్ (DSA) కోసం పెద్ద పెద్ద బుక్స్ చదవనక్కర్లేదు. కేవలం 'అర్రేస్ (Arrays)' , 'హాషెస్ (Hashes)' బాగా నేర్చుకుంటే చాలు. తన 90 శాతం ఇంటర్వ్యూలలో వీటి నుంచే ప్రశ్నలు అడిగారని క్లారిటీ ఇచ్చాడు.
  • ఏఐ (AI) పరిజ్ఞానం ముఖ్యం: ప్రస్తుతం ఇంటర్వ్యూలలో కంపెనీలు అభ్యర్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడటం వచ్చా లేదా అని చెక్ చేస్తున్నాయి. అయితే ఇందులో పీహెచ్‌డీ రేంజ్ నాలెడ్జ్ అవసరం లేదు, రోజువారీ పనుల్లో ఏఐ టూల్స్ ఎలా వాడాలో తెలిస్తే చాలు.
  • పాత పద్ధతులే బెటర్: ఏఐ టెక్నాలజీలు ఎంత వచ్చినా సరే కంపెనీల హైరింగ్ ప్రాసెస్ మాత్రం పాత పద్ధతిలోనే సాగుతోంది. ఆన్‌లైన్ అసెస్‌మెంట్, కోడింగ్ రౌండ్స్, సిస్టమ్ డిజైన్, బిహేవియరల్ రౌండ్స్ ఆధారంగానే ఎంపికలు జరుగుతున్నాయి.

ఒకే ఆదాయంపై నమ్మకం వద్దు బాస్!

ఖాళీగా ఉన్న సమయంలో నిరాశ పడకుండా RAG సిస్టమ్స్, పర్సనల్ సైడ్ ప్రాజెక్టులపై వర్క్ చేయడం వల్ల తన మైండ్ పాజిటివ్‌గా ఉంచగలిగానని అతడు చెప్పాడు. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారికి ఒక ముఖ్యమైన హెచ్చరిక చేశాడు. జీవితంలో కేవలం ఒకే కంపెనీ ఉద్యోగంపై ఆధారపడటం కరెక్ట్ కాదని, ఇప్పుడే మీకున్న స్కిల్స్‌తో రెండో ఆదాయ మార్గాన్ని (Side Income) క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలని సూచించాడు.

ఈ టెక్కీ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఎందుకు అంతలా వైరల్ అవుతోందంటే, ఇందులో ఉన్న ప్రాక్టికల్ టిప్స్ ఉద్యోగం కోసం చూస్తున్న ఎంతో మందికి ఉపయోగపడేలా ఉన్నాయి. "మార్కెట్ చాలా ఘోరంగా ఉంది, కానీ మనం చేయాల్సింది ఒకటే.. పట్టు వదలకుండా ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉండాలి" అంటూ అతడు ఇచ్చిన సందేశం నిజంగా గ్రేట్ కదా!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+