Microsoft News: బెంగళూరుకు చెందిన హైమంతిక మిత్రా తన డ్రీమ్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం సంపాదించేందుకు బాగా కృషి చేసింది. ఇందుకోసం ఏకంగా 30 కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించింది.
24 ఏళ్ల యువ టెక్కీ మైక్రోసాఫ్ట్ నిర్వహిస్తున్న సెల్ఫ్ లెర్న్ స్కిల్స్ ప్రోగ్రాం సహాయంతో కోడ్ ఎలా చేయాలో నేర్చుకుంది. కంపెనీలో జాబ్ సంపాదించినప్పటికీ ఏడాది తర్వాత దానిని విడిచిపెట్టినట్లు వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ వర్క్‌ప్లేస్ కల్చర్ అనుమతించిన దానికంటే వైవిధ్యమైన పాత్రలో పనిచేయాలని, వేగంగా ఎదగాలని తాను గ్రహించానని మిత్రా చెప్పారు. దీంతో టెక్ దిగ్గజాన్ని వీడి వేరే కంపెనీలో కోరుకున్న పదవిని చేపట్టింది.

మిత్రా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురికి చెందిన ఆమె ప్రస్తుతం బెంగళూరులో నివశిస్తున్నారు. తాను యాక్టివ్‌గా ఉన్న మొదటి టెక్నికల్ గ్రూప్ మైక్రోసాఫ్ట్ స్టూడెంట్ అంబాసిడర్ కమ్యూనిటీ అని తెలిపింది. కమ్యూనిటీలో భాగం కావడం వల్ల ఇంజనీర్లు, సీనియర్ ప్రొఫెషనల్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి తనకు అవకాశం లభించినట్లు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో జాబ్ చేయాలనే ఆలోయనతో వెబ్‌సైట్‌లో ఉంచిన ఓపెనింగ్‌ల కోసం దరఖాస్తు చేస్తూనే ఉండేది. అలా దాదాపు 30 కంటే ఎక్కువ సార్లు ఉద్యోగం కోసం ప్రయత్నాలు కొనసాగించింది.
డిసెంబర్ 2020లో దేశవ్యాప్తంగా నిర్వహించిన హ్యాకథాన్ కార్యక్రమంలో పాల్గొనేవారి నుంచి సపోర్ట్ ఇంజనీర్లను నియమించుకుంటున్నట్లు మిత్రా తెలుసుకున్నారు. అలా దరఖాస్తు చేసుకున్న మెుత్తం 11,000 మందిలో షార్ట్‌లిస్ట్ అయ్యారు. అయితే చివరి రౌండ్ కు చేరుకోలేకపోయింది. అయితే ఆమె పనితీరు చూసిన మైక్రోసాఫ్ట్ రిక్రూటర్లు ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి అంగీకరించారు. అలా కంపెనీలో ఏప్రిల్ 2021లో ఇంటర్న్‌షిప్ ప్రారంభించింది. ఆ తర్వాత ఇంటర్వ్యూల్లో నెగ్గి జాబ్ కొట్టింది.
కంపెనీలో ఇతర పాత్రలకు వెళ్లాలంటే కొన్నేళ్ల పాటు ప్రస్తుత పాత్రలోనే పనిచేయాలని గ్రహించింది. అయితే వేగవంతమైన కెరీర్ వృద్ధి కావాలనుకున్న మిత్రా నిష్క్రమించింది. మిత్రా ప్రస్తుతం బెంగుళూరులో మరొక టెక్ కంపెనీతో పని చేస్తున్నారు. భవిష్యత్తులో తగిన స్థానం లభిస్తే తిరిగి మైక్రోసాఫ్ట్ కంపెనీకి తిరిగి రావాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications