ఈ కంపెనీల్లో పెట్టుబడి మెరుగైన రాబడికి అవకాశం: బ్రోకరేజ్ సంస్థల అంచనా!

ఇండియా అభివృద్ధి సాధించిన దేశంగా ఎదగాలంటే ఇంకా చాలా ఎదగాలి. దేశంలో రోడ్లు, ప్రాజెక్టులు, రైల్వేస్, విమానయానం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు బాగా మెరుగవ్వాలి. అందుకే, కేంద్ర ప్రభుత్వం ఒక బృహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వచ్చే ఐదేళ్ళలో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కొరకు అక్షరాలా రూ లక్ష కోట్లు (రూ 1,00,000 కోట్లు) ఖర్చు చేయాలనీ సంకల్పించింది. ఈ నిర్ణయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భాగంగా ఎర్రకోట పైనుంచి దేశ ప్రజలకు వెల్లడించారు.

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఇదే విషయాన్నీ రెండు రోజుల క్రితం విలేకరుల సమావేశంలో మరో సారి వెల్లడించారు. వచ్చే ఐదేళ్ళలో రూ 1.02 లక్షల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కోసం వెచ్చిస్తామన్నారు. దీంతో ఇప్పడు స్టాక్ మార్కెట్ అనలిస్టుల దృష్టి ఈ రంగంలో ఉన్న కంపెనీలపై పడింది. అనుభవంతో పాటు కొన్నేళ్లుగా మెరుగైన పనితీరును కనబరుస్తున్న ఇన్ఫ్రా కంపెనీల స్టాక్స్ కొంటె మెరుగైన రాబడి ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం కొన్ని పటిష్టమైన ఫండమెంటల్స్ కలిగిన కంపెనీల షేర్లను సూచిస్తున్నారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం వెల్లడించింది. అందులో నుంచి మీ కోసం కొన్ని వివరాలు.

ఎల్ అండ్ టీ, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ....

ఎల్ అండ్ టీ, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ....

మౌలిక సదుపాయాల రంగంలో ఎనలేని అనుభవం గడించిన ఎల్ అండ్ టీ, హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మన తెలుగు కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, పీఎన్ సి ఇన్ఫ్రా టెక్, కే ఈ సి ఇంటర్నేషనల్ వంటి కంపెనీల షేర్లు కొనుగోలు చేయవచ్చని ఈటీ తన కథనంలో వెల్లడించింది. బ్రోకరేజ్ సంస్థల రెకమెండేషన్ ప్రకారం ఆయా కంపెనీల షేర్ల పెట్టుబడులు మెరుగైన రాబడులు అందించగలవని పేర్కొంది. ఈ కంపెనీల గత పనితీరు, ప్రస్తుత ఆర్డర్ బుక్ పోసిషన్ ఆధారంగా వాటికి మెరుగైన రేటింగ్ లభిస్తోంది. వీటితో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు ఫండమెటల్స్ పటిష్టంగా ఉన్న మరికొన్నీ కంపెనీలను కూడా తమ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కోసం పరిశీలించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐదారేళ్లుగా దేశంలో మౌలిక సదుపాయాల రంగ కంపెనీలు దివాళా తీస్తున్నాయి. అందుకే కంపెనీల ఎంపిక సరిగ్గా ఉండాలని వారు చెబుతున్నారు.

ఎస్బీఐ ఎంపిక కేఎన్ఆర్ ...

ఎస్బీఐ ఎంపిక కేఎన్ఆర్ ...

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎస్బీఐ కాపిటల్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల కోసం మూడు కంపెనీలను సూచించింది. అందులో మన తెలుగు కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉంది. దీంతో పాటు పీఎన్సి ఇన్ఫ్రా టెక్, హెచ్ జీ ఇన్ఫ్రా కంపెనీలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వ ప్రకటన బాగున్నా... భూముల కొనుగోలు ప్రక్రియ, అనుమతులు, ప్రాజెక్ట్ ఫైనాన్స్, దీర్ఘకాళిక ప్రాజెక్టుల్లో బ్యాంకులు భాగస్వాములు అయ్యే ప్రయత్నాలు సరిగ్గా లేకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదని హెచ్చరించింది. ఈ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. గతం లో జరిగిన తప్పులను పునరావృత్తం కనీయవద్దని తెలిపింది.

ప్రణాళిక, వేగం ముఖ్యం...

ప్రణాళిక, వేగం ముఖ్యం...

మరో ప్రఖ్యాత బ్రోకరేజ్ సంస్థ ఎడిల్ వైస్ కూడా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చింది. ప్రోజెక్టుల ప్రణాళిక పక్కాగా ఉండాలని, వేగంగా పనులు జరగాలని సూచించింది. ఇది కూడా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ను ఎంపిక చేసుకోగా, ఎల్ అండ్ టీ కూడా తన ఫేవరెట్ బెట్ గా ఎంచుకుంది. కాంట్రాక్టు ఒప్పందాలు, ప్రభుత్వ నియంత్రణ వ్యవస్థ మరింత పటిష్టంగా పారదర్శకంగా ఉండాలని సెంట్రమ్ బ్రోకింగ్ పేర్కొంది. మొత్తం నిధుల్లో రాష్ట్రాలు 39% వాటాను సమకూర్చాలంటే వాటికి సాగిన వనరుల లభ్యతపై ఈ సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. ఇలా ఉండగా ప్రభుత్వ నిర్ణయం మౌలిక సదుపాయాల రంగ కంపెనీలకు చాలా పాజిటివ్ అని, పెట్టుబడులు కూడా సాధ్యమేనని నోమురా వెల్లడించింది. దిలీప్ బిల్డ్ కాన్, కేఎన్ ఆర్, ఎల్ అండ్ టీ, కె ఈ సి, పీ ఎన్ సి లను తన ఫేవరెట్ కంపెనీలుగా పేర్కొంది. సమగ్ర పరిశీలన, నిర్వహణ ద్వారా లక్ష్యాన్ని సాధించవచ్చని సిటీ గ్రూప్ గ్లోబల్ మర్కెట్స్ తెలిపింది. ఎల్ అండ్ టీ తన ఫేవరెట్ స్టాక్ అని ప్రకటించింది. సో ఇన్వెస్టర్లూ... కొత్త ఏడాదిలో ఈ కంపెనీల షేర్లపై ఓ లుక్కేయండి మరి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+