Delhi Airport: దిల్లీ విమానాశ్రయంలో ప్రమాదం.. L&T కీలక ప్రకటన..
Delhi airport T1 roof collapse: దేశ రాజధాని దిల్లీ విమానాశ్రయంలో నిన్న జరిగిన ప్రమాదం పెద్ద చర్చకు దారితీసింది. వాస్తవానికి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పు కుప్పకూలటం పెద్ద ప్రమాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో దాదాపు ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా దాదాపు ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయని తెలుస్తోంది. అలాగే ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
వాస్తవానికి దిల్లీలో భారీగా కురుస్తున్న వర్షాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అలాగే టెర్మినల్-1 నుంచి బయలుదేరే అన్ని సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ దుర్ఘటన మరువక ముందే నేడు గుజరాత్ రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్‌లోని ఓ టర్మినల్ వద్ద పైకప్పు ఎగిరిపోయింది. ఈ ప్రమాదాలపై కొత్తగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి రామ్మోహన్ నాయుడు పరిస్థితులను రివ్యూ చేస్తున్నారు. వరుస ప్రమాదాలకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తోంది.

ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ వేగంగా దేశంలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు వాటి పరిస్థితి కూడా ఇలానే ఉందా అనే విధంగా నిర్మాణాల నాణ్యతపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
L&T ప్రకటన..
భారీ వర్షాల కారణంగా దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్- 1 వద్ద పైకప్పు కూలిపోయిన ఒక రోజు తర్వాత ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (L&T) స్పందించింది. ప్రస్తుతం కూలిపోయిన నిర్మాణాన్ని తాము కట్టలేదని లేదా దాని నిర్మాణాన్ని తాము చూడటం లేదని పేర్కొంది. ఈ ప్రమాదంలో గాడపడిన, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు కంపెనీ తన సానుభూతుని ప్రకటించింది. తమకు ప్రస్తుతం ప్రమాదం జరిగిన నిర్మాణాలతో ఎలాంటి సంబంధం లేదని కంపెనీ వెల్లడించింది. దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు 2019లో L&T టెర్మిలన్-1 కోసం విస్తరణ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రమాతం అప్పట్లో తమ ప్రమాద స్థలానికి 110 మీటర్ల దూరంలో జరిగిందని క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications