అంతర్జాతీయ సాఫ్టువేర్ దిగ్గజాలతో పోటీపడేలా దేశీయంగా మరో పెద్ద ఐటీ సంస్థ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా తమ నియంత్రణలోని టెక్ సంస్థలు మైండ్ ట్రీ, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌లను విలీనం చేయాలని లార్సన్ అండ్ టుబ్రో లిమిటెడ్ భావిస్తోందని వార్తలు వచ్చాయి. ఈ రెండు సంస్థలు స్టాక్ ఎక్స్చేంజీల్లో నమోదయ్యాయి. కంపెనీల విలీనానికి సంబంధించిన షేర్లు మార్పిడి నిష్పత్తిని, మైండ్ ట్రీ, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ బోర్డులు వచ్చేవారం మొదట్లో పరిశీలించవచ్చునని చెబుతున్నారు.
మైండ్ ట్రీలో ఎల్ అండ్ టీకి 61 శాతం వాటా ఉంది. 2019లో మైండ్ ట్రీలో నియంత్రిత వాటాను ఎల్ అండ్ టీ కొనుగోలు చేసింది. 8.3 బిలియన్ డాలర్లు మన కరెన్సీలో రూ.62,250 కోట్ల మార్కెట్ వ్యాల్యూ కలిగిన మైండ్ ట్రీలో ఎల్ అండ్ టీకి 61 శాతం వాటా ఉంది. 13.6 బిలియన్ డాలర్లు లేదా రూ.1.02 లక్షల కోట్ల మార్కెట్ వ్యాల్యూ కలిగిన ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌లో ఎల్ అండ్ టీకి 74 శాతం వాటా ఉంది. ఈ రెండు కంపెనీలు విలీనమైతే 22 బిలియన్ డాలర్ల వ్యాల్యూ కలిగిన సంస్థగా నిలుస్తుంది. మన కరెన్సీలో రూ.1.65 లక్షల కోట్ల వరకు ఉంటుంది.

ఈ రెండు కంపెనీల వ్యాపారాల్లో లేదా క్లయింట్స్ విషయంలో సారూప్యత తక్కువగా ఉంది. ఈ రెండు సంస్థలు కలిస్తే ప్రాజెక్టుల ధరల విషయంలో ఖాతాదారులతో మరింత మెరుగ్గా వ్యవహరించేందుకు వీలవుతుందని, వ్యయాలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే విలీనం వార్తలపై మైండ్ ట్రీ స్పందించింది. మైండ్ ట్రీ, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ విలీనం వార్తలు ఊహాజనితమే అని పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications