working hours: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి పని గంటలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. పలువురు దిగ్గజ కంపెనీల అధినేతలు, CEOలు తమదైన అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా L&T మాజీ ఛైర్మన్ కూడా ఈ జాబితాలో చేరారు.
L&Tని దిగ్గజ ఇంజనీరింగ్ కంపెనీగా తీర్చిదిద్దడానికి 5 దశాబ్దాలకు పైగా శ్రమించినట్లు సంస్థ మాజీ ఛైర్మన్ AM నాయక్ తెలిపారు. ఇందుకోసం రోజుకు 15 గంటలపాటు శ్రమించినట్లు వివరించారు. ఇంటికి వెళ్లిన తరువాత కూడా మరో గంటపాడు కంపెనీ గురించే ఆలోచించినట్లు చెప్పారు. రోజుల తరబడి పనిచేసిన అనంతరం ఆఫీస్ టేబుల్ పైనే నిద్రపోయిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు.

అప్పట్లో బిర్లాలు చేపట్టిన కార్పోరేట్ టేకోవర్ వార్ లో L&Tని రక్షించేందుకు సహాయం చేసిన మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌కు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. తన కెరీర్‌లో చాలా మంది ప్రధాన మంత్రులను కలిశానని.. వారిలో కొందరు L&T వల్ల తమ పదవులను నిలబెట్టుకోగలిగారని వివరించారు.
ఇక L&T పగ్గాలు తన చేతిలో ఉన్న 20 ఏళ్లలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 130 రెట్లు పెరిగి 4 వేల కోట్ల నుంచి 5 లక్షల కోట్లకు చేరినట్లు చెప్పారు. జీవితంలో విజయం సాధించాలంటే శ్రద్ధ, అభిరుచి, దృఢ నిశ్చయం, నిబద్ధత కలిగి ఉండాలని యువతకు సూచించారు. సెల్ఫ్ లెర్నింగ్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
సమాజం కోరుకునే వాటిని ఆచరణాత్మకంగా నేర్పించడంపై బి-స్కూల్స్ దృష్టి సారించడం లేదని నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. L&T చేపట్టిన హిమాలయాల్లో స్లోగింగ్, ఎడారిలో హోవిట్జర్ల టెస్టింగ్ బృందాల్లో IIMల నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్ ఒక్కరూ లేరన్నారు. దేశాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు తమ విద్యార్థులను 3 నెలల పాటు గ్రామాలకు పంపించాలని అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications