L&T Finance: దేశంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్న L&T ఫైనాన్స్ సంస్థ శనివారం తాజాగా తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ తన నాలుగో త్రైమాసికంలో మంచి వృద్ధి రేటును సాధించింది.
మార్చితో ముగిసిన త్రైమాసిక కాలానికి కంపెనీ నికర లాభం 11 శాతం వృద్ధితో రూ.554 కోట్లుగా నమోదైంది. అయితే కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభం రూ.640 కోట్ల కంటే లాభాలు క్షీణించాయి. అయితే కంపెనీ సెక్యూరిటీ రిసీట్స్ కోసం ఒక్కసారి ప్రుడెన్షియల్ ప్రొవిజన్ కింద రూ.175 కోట్లను నాలుగో త్రైమాసికంలో అలాకేట్ చేసినట్లు కంపెనీ సీఎఫ్ఓ సచిన్ జోషి పేర్కొన్నారు. అయితే 2024 ఆర్థిక సంవత్సరం మెుత్తం ఏడాదికి కంపెనీ నికర లాభం 43 శాతం పెరిగి రూ.2,320 కోట్లుగా నమోదైనట్లు తన స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్‌లో కంపెనీ పేర్కొంది.

కంపెనీ రిటైల్ లోన్ బుక్ గత ఏడాది కంటే నాలుగో త్రైమాసికంలో 33 శాతం పెరిగి రూ.15,044 కోట్లుగా నిలిచినట్లు కంపెనీ వెల్లడించింది. రిటైల్ బుక్ 25 శాతం టార్గెటెడ్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వృద్ధి రేటుతో పోలిస్తే సంవత్సరానికి 31 శాతం పెరిగింది. జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ వడ్డీ ఆదాయం రూ.3,322.60 కోట్లుగా ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ నికర వడ్డీ ఆదాయం నాలుగో త్రైమాసికంలో 14 శాతం పెరిగి రూ.1,909 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్ ప్లస్ ఫీజులు, ఇతర ఆదాయం 11.25 శాతంగా ఉంది. అలాగే క్రెడిట్ ఖర్చులు ఏడాది క్రితం 2.24 శాతం నుంచి 2.39 శాతానికి పెరిగాయి.
Q4FY24లో అత్యధిక త్రైమాసిక రిటైల్ చెల్లింపులు రూ.15,044 కోట్లు, ఏడాదికి 33 శాతం, వరుసగా త్రైమాసికానికి 4 శాతం పెరిగింది. అత్యధిక వార్షిక రిటైల్ పంపిణీలు రూ.54,267 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీ లక్ష్య 2026 వ్యూహాత్మక ప్రణాళిక రెండవ ఏడాదిలోనే షెడ్యూల్ కంటే చాలా ముందుగానే అధిగమించి 94 శాతం రిటైలైజేషన్‌ను చేరుకోవటం సంతోషంగా ఉందని కంపెనీ సీఈఓ, ఎండీ సుదీప్తా రాయ్ చెప్పారు. సవాలుగా ఉన్న వడ్డీ రేటు వాతావరణం ఉన్నప్పటికీ.. తమ రుణ వ్యయం స్థిరంగా ఉందన్నారు. ప్రస్తుతం తమ దృష్టి 95 శాతం రిటైలైజేషన్ లక్ష్యాన్ని అధిగమించడంపై, బలమైన లోన్ బుక్ వృద్ధిపైనే ఉందని ఆమె అన్నారు. శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్ఈలో కంపెనీ షేర్ ధర రూ.163.75గా ఉంది.


Click it and Unblock the Notifications