Share Market: దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రాముఖ్యత ఇస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. అనాదిగా ఉన్న రైళ్ల స్పీడ్ పెంచింది. బుల్లెట్ ట్రైన్స్ ను సైతం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ సైతం ముగిసింది. దేశీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంది.
ప్రతిష్ఠాత్మక ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా 135.45 కిలోమీటర్ల మేర MAHSR-C3 ప్యాకేజ్ నిర్మాణానికి L&T కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(NHSRCL) నుంచి ఈ మెగా ప్రాజెక్టు కైవసం చేసుకున్నట్లు తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది.

508 కిలోమీటర్లు కొనసాగే ఈ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టును బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. మహారాష్ట్ర దాదాపు 156 కిలోమీటర్లు, దాద్రా నగర్ హవేలీలో నాలుగున్నర కి.మీలు, గుజరాత్ లో 348 కిలోమీటర్లు చొప్పున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఇందులో మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి.
ఈ కాంట్రాక్ట్ కు సంబంధించి MAHSR-C3 పరిధిలో పలు స్టేషన్లు, నదీ వంతెనలు, సొరంగాలు సహా వివిధ నిర్మాణ కార్యక్రమాలను L&T పూర్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు విలువను కంపెనీ వెల్లడించనప్పటికీ, 8 వేల కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ సాధించడంతో దాని షేర్ విలువ 4 శాతం పెరిగి 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. తద్వారా సెన్సెక్స్లో లీడ్ గెయినర్ గా అవతరించింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications