మన ఇండియన్ సీరియల్‌లో బిల్ గేట్స్ స్పెషల్ ఎంట్రీ… అయితే, బిల్ గేట్స్ ఏ సందేశం ఇవ్వబోతున్నారు?
ఇండియన్ టెలివిజన్ లో రేర్ మోమెంట్! మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, తులసి విరానితో వీడియో కాల్ ద్వారా షోలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ ప్రోమో "క్యున్కి సాస్ భీ కభీ బహూ థీ" కొత్త ఎపిసోడ్ కోసం విడుదల అయ్యింది. ఈ వీడియోలో, బిల్ గేట్స్ తులసితో ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ, ఆమె కుటుంబానికి అమెరికా నుండి నేరుగా సెల్యూట్ చెయ్యడం చూపించబడింది.
వీడియోలో తులసి విరాని ఇలా చెప్పింది, "బహుత్ అచ్చా లగా యే జాంకే కి మీరు సీధ్ అమెరికా నుండి సీధ్ మా కుటుంబానికి జూడ్ రహే హై. ఆప్ కా హమ్ సబ్ బెసబ్రీ సే ఇంటిజార్ కార్ రహే హై" అంటే, "మీరు నేరుగా అమెరికా నుండి మా కుటుంబానికి కనెక్ట్ అవుతున్నారని తెలుసుకొని చాలా బాగుంది. మేము అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. దానికి బిల్ గేట్స్ ధన్యవాదాలు తులసి జీ అని సమాధానం ఇచ్చారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రోమో క్యాప్షన్ లో రాశారు, ఈసారి #KyunkiSaasBhiKabhiBahuThi కథలో ఒక కొత్త సంబంధం ఏర్పడుతోంది అది ఆరోగ్యం, సహానుభూతి, మార్పు కోసం. ఈ కథలో ప్రపంచంలోని ప్రముఖ చేంజ్‌మేకర్ బిల్ గేట్స్ కూడా కలిసారు, ఆయన అభిప్రాయం: ప్రతి తల్లి, ప్రతి పిల్లా సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉండాలి. మిస్టర్ బిల్ గేట్స్ మరియు మా తులసి ఈ విషయం పై ఏం చెప్పారో చూడడానికి, Kyunki Saas Bhi Kabhi Bahu Thi చూడండి.
స్మృతి ఇరాని ఈ ప్రత్యేక అతిధి పాత్రని భారత టెలివిజన్ కోసం చారిత్రక క్షణంగా పేర్కొన్నారు. CNBC TV-18 ఇంటర్వ్యూలో ఆమె అన్నారు "ఇది భారత వినోదంలో ఒక చారిత్రక క్షణం. చాలా కాలంగా, మహిళల మరియు పిల్లల ఆరోగ్యం ప్రధాన ప్రసంగంలో సరిగా చూడలేదు. ఈ కార్యక్రమం అది మార్చే శక్తివంతమైన ప్రయత్నం అని చెప్పారు. ఇది బిల్ గేట్స్ రెండవ టెలివిజన్ ప్రదర్శన. ముందుగా ఆయన 'ది బిగ్ బ్యాంగ్ థియరీ'లో చిన్న కేమియో చేశారు. ఈసారి, ఆయన తులసి తో వీడియో కాల్ ద్వారా చూపించడం, ప్రేక్షకులకు పెద్ద ఆనందాన్ని ఇచ్చింది.
ఈ ఎపిసోడ్ కేవలం వినోదానికి పరిమితం కాకుండా, అందులో ఒక ముఖ్యమైన సామాజిక సందేశం కూడా ఉంది. బిల్ గేట్స్ మరియు షో నిర్వాహకులు ఈ కథ ద్వారా మహిళల మరియు పిల్లల ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రదర్శిస్తున్నారు. ప్రతి తల్లి, ప్రతి చిన్నారి సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలి అనే సూత్రాన్ని ప్రేక్షకుల దృష్టికి తీసుకువచ్చారు. ఇది ప్రజలకు ఒక చైతన్యాన్ని, ఆలోచింపజేస్తుంది, మరియు వ్యక్తిగతంగా మనం ఆరోగ్యంపై గౌరవం చూపడం, పిల్లల భద్రత కోసం జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని గుర్తు చేస్తుంది. కాబట్టి, ఈ ఎపిసోడ్ కేవలం వినోదం మాత్రమే కాకుండా, ఒక విద్యాసారమైన, ప్రేరణాత్మక సందేశం కూడా అందిస్తోంది.


Click it and Unblock the Notifications