ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2020 క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సంపాదన కలిగిన వారిలో అమెరికన్ మీడియా పర్సనాలిటి, రియాల్టీ టీవీ స్టార్ కైలీ జెన్నెర్ ముందు నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా టాప్-ఎర్నింగ్ స్టార్స్ కలిసి 2020లో 6.1 బిలియన్ డాలర్లు ఆర్జించారు. ఇందులో కైలీ జెన్నెర్, కేనీ వెస్ట్ అగ్రపథాన నిలిచారు. ఈ ఏడాది ఆమె ఆర్జన 590 మిలియన్లుగా ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అమె తన బ్యూటీ బ్రాండ్ వాటాను కోటీ ఇంక్ సంస్థకు విక్రయించడంతో ఆదాయం పెరిగింది.

జాబితాలో వీరు.. వినోదరంగంపై ప్రభావం
కైలీ జన్నర్ తర్వాత కేనీ వెస్ట్ 170 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. యాదృచ్ఛికంగా ఈ అమెరికన్ రాపర్, రికార్డ్ ప్రొడ్యూసర్ (కేనీ వెస్ట్) కైలీ జెన్నర్‌కు బ్రదర్ ఇన్‌లా అవుతారు. ఇతని భారీ ఆదాయానికి ప్రధాన కారణంగా ఆదిదాస్‌తో భాగస్వామ్యం. టాప్ 10లో టైలర్ పెర్రీ, హోవార్డ్ స్టెర్న్, డ్వేన్ జాన్సన్‌తో పాటు ప్రముఖ అథ్లెట్స్ రోజర్ ఫెదరర్, క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, నెయ్‌మార్, లెబ్రాన్ జేమ్స్ ఉన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది వినోదరంగంపై భారీ ప్రభావం పడింది. దీంతో ఈ రంగం నుండి ఈ ఏడాది మొత్తం 6.1 బిలియన్ డాలర్లు కాగా, 2019తో పోలిస్తే 200 మిలియన్ డాలర్లు తక్కువ.

రోజర్ ఫెదరర్ టాప్ అథ్లెట్
కైలీ జెన్నర్ తన కేలీ కాస్మోటిక్స్ కంపెనీని 51 శాతం విక్రయించడంతో ఎక్కువగా ఆర్జించారు. ఈ సేల్ ద్వారా 600 మిలియన్ డాలర్లు సంపాదించారు. కైలీ కాస్మోటిక్స్ రెవెన్యూ 2019లో 200 మిలియన్ డాలర్లు. ఇక, స్పోర్స్ట్స్ శాలరీస్ ద్వారా ఫెదరర్, రొనాల్డో, మెస్సీ వంటి వారు భారీగా సంపాదించారు. స్పోట్స్‌లో ఎక్కువ ఆదాయం ఆర్జించిన వారిలో రోజర్ ఫెదరర్ 106.3 మిలియన్లతో నిలిచారు. ఇతని ఆదాయంలో ఎక్కువగా ఎండోర్స్‌మెంట్ డీల్స్ ఉన్నాయి. ఇందులో జపానీస్ అప్పారెల్ బ్రాండ్ యూనిక్‌లో 300 మిలియన్ డాలర్ల డీల్ ఉంది.

టాప్ 10 వీరే..
సాకర్ సెన్సేషన్ క్రిస్టియానో రొనాల్డో 105 మిలియన్ డాలర్ల ఆర్జనతో నాలుగో స్థానంలో ఉన్నారు. లియోనల్ మెస్సీ 104 మిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఫిలిం మేకర్ పెర్రీ టూక్ 97 మిలియన్లతో 6వ స్థానంలో, 95.5 మిలియన్ డాలర్లతో నెయ్‌మార్ 7వ స్థానంలో, 90 మిలియన్ డాలర్లతో షాక్ జాక్ హోవార్డ్ స్టెర్న్ 8వ స్థానంలో, లెబ్రోన్ జేమ్స్ 88.2 మిలియన్ డాలర్లతో 9వ స్థానంలో, డ్వేన్ జాన్సన్ 87.5 మిలియన్ డాలర్లతో పదవ స్థానంలో ఉన్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications