చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ పదవికి కేవీ సుబ్రమణియన్ రాజీనామా
కేవీ సుబ్రమణియన్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్(CEA) పదవి నుండి తప్పుకున్నారు. భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా తన మూడేళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఆయన CEA బాధ్యతల నుండి తప్పుకున్నట్లు శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశానికి సేవ చేయడం గొప్ప అదృష్టమని, తనకు దక్కిన అద్భుతమైన అవకాశం అని పేర్కొన్నారు. దేశానికి సేవ చేయడం కోసం తనకు అద్భుతమైన మద్దతు, ప్రోత్సాహం లభించిందన్నారు. తాను ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించేందుకు తిరిగి అకాడమీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
పీఎంవో, నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రిత్వ శాఖ, పీఐబీ నుండి మద్దతు లభించిందని పేర్కొన్నారు. సుబ్రమణియన్ 2018 డిసెంబర్ 7వ తేదీన చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు అర్వింద్ సుబ్రమణియన్ పదవీ నుండి తప్పుకున్న ఐదు నెలల అనంతరం బాధ్యతలు చేపట్టారు.

ప్రభుత్వం నుండి తనకు అద్భుతమైన ప్రోత్సాహం, అనూహ్యమైన మద్దతు లభించిందని, సీనియర్లతో స్నేహపూర్వక సంబంధాన్ని ఆస్వాదించానని, దీనిని తాను అదృష్టంగా భావిస్తున్నానని, తన వృత్తి జీవితంలో దాదాపు మూడు దశాబ్దాలలో ప్రధాని నరేంద్ర మోడీ వంటి స్ఫూర్తిదాయక నాయకుడిని చూడలేదన్నారు. ఆర్థిక విధానంపై అతని సహజ అవగాహన సాధారణ పౌరుల జీవితాలను పెంచడానికి ఉపయోగించాలనే స్పష్టమైన సంకల్పంతో ఉన్నారన్నారు. అలాగే, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫీడ్ బ్యాక్‌కు థ్యాంక్స్ చెప్పారు. నార్త్ బ్లాక్‌లో జరిగిన సమావేశాల్లో మేడమ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఈజీ మ్యానర్‌ను ప్రశంసించారు.


Click it and Unblock the Notifications