రైతు తెలివికి హ్యాట్సాఫ్..! చిన్న ట్రిక్‌తో రూ.7 ఉల్లిని రూ.15కి అమ్మాడు? బిజినెస్ అంటే ఇలా ఉండాలి!
Business Idea: సాధారణంగా పంటను పండించిన రైతే అందరికంటే తక్కువ లాభం పొందుతాడు. మార్కెట్ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చి.. నష్టాన్ని మిగుల్చుకుంటాడు. అయితే కర్నూలు జిల్లాకు చెందిన ఒక రైతు మాత్రం ఈ సంప్రదాయ పద్ధతికి స్వస్తి పలికి తన తెలివైన మార్కెటింగ్ ట్రిక్ (Marketing Trick) ద్వారా అధిక లాభం పొందాడు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

కేజీ రూ.7 ఉల్లికి రూ.15 లాభం..
కర్నూల్ మార్కెట్ యార్డ్‌లో ఉల్లిపాయల ధరలు పడిపోవడంతో ఒక క్వింటాల్ ఉల్లి ధర కేవలం రూ. 736 (కేజీ రూ. 7.36) మాత్రమే పలికింది. ఈ ధరకు అమ్ముకుంటే పెట్టుబడి కూడా రాదని నిర్ణయించుకున్న ఆ రైతు వినూత్నంగా ఆలోచించాడు. మార్కెట్‌లో తక్కువ ధర ఉన్నా పట్టణాల్లోని రిటైల్ దుకాణాల్లో కేజీ రూ. 40 చొప్పున అమ్ముతున్నారు. అంటే.. వినియోగదారులకు డిమాండ్ ఉంది. దీన్ని అర్థం చేసుకున్న ఆ రైతు.. తానే నేరుగా ఉల్లిపాయలను అమ్మడం మొదలుపెట్టాడు.
ప్యాక్ చేసి.. బండిలో వేసి..
ఆ రైతు తన ఉల్లి లోడ్‌ను మినీ వ్యాన్‌లో వేసుకుని.. డిమాండ్ ఉన్న పట్టణ ప్రాంతాలకు నేరుగా తీసుకెళ్లాడు. ఉల్లిని 2 కేజీలు, 10 కేజీల బ్యాగులుగా తయారు చేసి అమ్మాడు. పది కేజీల ఉల్లి బ్యాగుని రూ. 150కి అమ్మాడు. అంటే కేజీ ధర రూ. 15 చొప్పున అమ్మాడు. ఈ పద్ధతి వల్ల రైతు మార్కెట్ ధర (రూ. 7.36) కంటే రెట్టింపు లాభం పొందాడు. అలాగే వినియోగదారులు కూడా బయటి మార్కెట్ ధర (రూ. 40) కంటే సగాని కంటే తక్కువ ధరకు నాణ్యమైన ఉల్లిని కొనుగోలు చేశారు. ఈ 'విన్-విన్' (Win-Win) పరిస్థితికి కారణం ఆ రైతు మధ్యవర్తులను తప్పించి.. తన ఉత్పత్తికి తానే ధరను నిర్ణయించుకోవడం.
చిన్న వ్యాపారులకు సీక్రెట్ ఫార్ములా
ఈ ఉదాహరణ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కేవలం టోకు ధరలపై ఆధారపడకుండా మీ ఉత్పత్తికి తగిన విలువను జోడించడం ద్వారా లాభాలను పెంచుకోవచ్చు. ఇది ఏ చిన్న వ్యాపారానికైనా ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఒక శక్తివంతమైన బిజినెస్ ట్రిక్ గా పనిచేస్తుంది.
- మీ పంటను బట్టి.. నేరుగా వినియోగదారులకు అమ్మే ప్రయత్నం చేయొచ్చు. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, రెసిడెన్షియల్ ఏరియాలు, లేదా వీకెండ్ ఫార్మర్స్ మార్కెట్‌లలో సొంత స్టాల్స్ ఏర్పాటు చేసి మీ పంట అమ్ముకోవచ్చు
- 2 కేజీలు, 5 కేజీలు లేదా వారానికి సరిపడా కూరగాయల కాంబో ప్యాక్స్ లా తయారు చేసి అమ్మాలి. బండిల్ కొనుగోలుపై కొద్దిగా రాయితీ ఇవ్వడం ద్వారా ఎక్కువ మొత్తంలో విక్రయించవచ్చు.
- పచ్చిమిర్చి, అల్లం వంటి వాటిని శుభ్రం చేసి, ముక్కలుగా చేసి ప్యాక్ చేయడం. పండ్ల నుండి జామ్‌లు లేదా రసాలు తయారు చేయడం. ఇలాంటి చిన్నపాటి ప్రాసెసింగ్ పనులు చేసి కూడా అదనగా ధర పెంచి లాభాలు పొందొచ్చు.
మొత్తంగా ఏ చిన్న వ్యాపారమైనా లేదా ఏ రైతు అయినా ఈ తెలివైన మార్కెటింగ్ ట్రిక్స్‌ను అమలు చేయడం ద్వారా మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడటమే కాకుండా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.


Click it and Unblock the Notifications