IPO News: ఐపీవో దమాఖా.. తెరుచుకోక ముందే 102% GMP.. మీరూ బెట్టింగ్ వేస్తున్నారా..?
KRN Heat Exchanger IPO: దేశవ్యాప్తంగా ఐపీవోల కోలాహలంలో ఇన్వెస్టర్లు మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తమ డబ్బును దీర్ఘకాలిక పెట్టుబడుల కంటే ఐపీవోలో వేగంగా రాబడులను అందుకోవచ్చని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో చరిత్రను పరిశీలిస్తే.. రానున్న రెండేళ్లుగా 90 శాతానికి పైగా లాభాల్లో లిస్టింగ్ అయ్యాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కెఆర్‌కె హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. రానున్న వారంలో అనేక కంపెనీలు తమ ఐపీవోలను ప్రారంభించటానికి మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు సైతం ఈ కంపెనీ షేర్లపై భారీగా దృష్టి సారిస్తున్నారు. కంపెనీ షేర్లు ఇప్పటికే గ్రే మార్కెట్‌లో 100% ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. KRN హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ ఐపీవో సెప్టెంబర్ 25న పెట్టుబడి కోసం తెరుకోనుంది. రిటైల్ పెట్టుబడిదారుల కోసం కంపెనీ షేర్లు సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు అందుబాటులో ఉండనుంది. అయితే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ షేర్లు ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 24న అందుబాటులో ఉంటాయి.

ఈ క్రమంలో కంపెనీ పెట్టుబడిదారుల కోసం ఒక్కో షేరుపై రూ.209-220గా నిర్ణయించింది. KRN హీట్ ఎక్స్ఛేంజర్ & రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ ఐపీవో గ్రే మార్కెట్‌లో రూ.223 ప్రీమియంతో లభిస్తుంది. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే కంపెనీ షేర్ల లిస్టింగ్ ధర రూ.443గా ఉండవచ్చు. అంటే ఇన్వెస్టర్లు మొదటి రోజు దాదాపు 102% భారీ లాభాన్ని ఆర్జించవచ్చు. కంపెనీ షేర్లు అక్టోబర్ 3న లిస్ట్ కావచ్చని తెలుస్తోంది.
కెఆర్‌కె హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.342 కోట్లు రైజ్ చేయాలని నిర్ణయించింది. కంపెనీ ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్ రౌండ్‌లో కంపెనీ గత నెలలో రూ.9.54 కోట్లను సమీకరించినట్లు ప్రకటించింది. ఇందుకోసం కంపెనీ తన ఐపీవోలో 1,55,43,000 విలువైన తాజా షేర్లను విక్రయానికి ఉంచింది. వాస్తవానికి తాజా ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని కంపెనీ విస్తరణ ప్రణాళిక కోసం వినియోగించాలని నిర్ణయించింది. రాజస్థాన్‌కు చెందిన ఈ కంపెనీ 'హీట్ వెంటిలేషన్ ఎయిర్ కండిషనింగ్', 'రిఫ్రిజిరేషన్' పరిశ్రమ కోసం ఫిన్ అండ్ ట్యూబ్ టైప్ 'హీట్ ఎక్స్ఛేంజర్‌లను' తయారు చేస్తోంది.
కంపెనీ వివిధ అవసరాల కోసం గడచిన 7 ఏళ్లుగా అనేక ఉత్పత్తులను అందిస్తోంది. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టింగ్ కోసం రాబోతోంది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని కంపెనీ 65 షేర్లుగా నిర్ణయించింది. ఇందుకోసం రూ.14,300 కనీస పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications