IPO News: గ్రేమార్కెట్లో ఐపీవో విధ్వంసం.. లిస్టింగ్ ముందు 122 శాతం జీఎంపీ..
KRN Heat Exchanger IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఐపీవోలు సరికొత్త రికార్డులతో గ్రేమార్కెట్లో పెట్టుబడిదారులకు సంతోషాన్ని పంచుతున్నాయి. నెల చివరికి వచ్చినప్పటికీ మార్కెట్లో రోజుకొక ఐపీవో ప్రకటన వెలువడుతూనే ఉంది. దీంతో ఇన్వెస్టర్లు వాటికోసం తమ డబ్బును సిద్ధం చేసుకుంటూనే ఉన్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కెఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ ఐపీవో గురించే. ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ చివరి రోజైన నేడు 200 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న భారీ స్పందనతో ఐపీవో గ్రేమార్కెట్లో భారీ ప్రీమియం ధర పలుకుతూ విధ్వంసం సృష్టిస్తోంది. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.341.95 కోట్లను సమీకరించేందుకు ఈ ఐపీవోను ప్రారంభించింది. ఈ క్రమంలో కంపెనీ ఐపీవో ఇన్వెస్టర్లకు 1.55 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచింది.

ఐపీవో పెట్టుబడిదారుల కోసం సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 28 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంచబడింది. ఈ క్రమంలో చివరి రోజున రిటైల్ కేటగిరీ 96.37 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 253.04 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 430.31 రెట్లు సబ్‌స్క్రిప్షన్ అందుకున్నాయి. కంపెనీ ఐపీవోలో లాట్ పరిమాణాన్ని 65 షేర్లుగా నిర్ణయించగా ఇందుకోసం ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.209 నుంచి రూ.220గా ఉంచింది. దీంతో ఐపీవోలో బెట్టింగ్ వేయాలనుకునే ఇన్వెస్టర్లు కనీసం రూ.14,300 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.100 కోట్లను సమీకరించింది. వీరికి 30 రోజులు లాక్ ఇన్ వ్యవధి ఉంటుంది.
ప్రస్తుతం ఐపీవో షేర్లు గ్రేమార్కెట్లో ఒక్కోటి 122 శాతం ప్రీమియం ధరతో ఉన్నాయి. ఇదే లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే కంపెనీ షేర్లు ఒక్కోటి మార్కెట్లోకి రూ.270 అధిక ప్రీమియం ధరను కలిగి జాబితా అవుతాయి. సోమవారం కంపెనీ షేర్ల కేటాయింపు ఉండవచ్చని తెలుస్తోంది. అలాగే ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో షేర్ల జాబితా అక్టోబర్ 3న ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రీమియం రేటు కొనసాగితే ఒక్కో షేరు రూ.490 వద్ద జాబితా అవ్వొచ్చు. ఇది నిజంగా పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను తెచ్చిపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
రైతు బిడ్డ స్థాయి నుంచి..
రాజస్థాన్‌లోని తిజారా అనే చిన్న పట్టణానికి చెందిన 44 ఏళ్ల కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్‌ఛేంజర్ కంపెనీ యజమాని సంతోష్ కుమార్ యాదవ్ ప్రస్థానం అందరికీ ఆదర్శనీయంగా చెప్పుకోవచ్చు. ఒక రైతు బిడ్డ అయిన సంతోష్ తొలుత లాయిడ్ ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్‌లో ట్రైనీ ఆపరేటర్‌గా ఉండటం నుంచి KRN హీట్ ఎక్స్ఛేంజర్స్ అండ్ రిఫ్రిజిరేషన్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా మారారు. 2013లో లాయిడ్ కంపెనీని విడిచిపెట్టి తన పెట్టుబడిదారుల సహకారంతో భివాడిలో మైక్రో కాయిల్స్ అండ్ రిఫ్రిజిరేషన్‌ను స్థాపించాడు. ఆ తర్వాత 2017లో కంపెనీలో తన వాటాను విక్రయించి KRN హీట్ ఎక్స్ఛేంజర్స్ అండ్ రిఫ్రిజిరేషన్‌ను ప్రారంభించాడు.


Click it and Unblock the Notifications