KRN Heat Exchanger IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో అందరూ ఊహించిన విధంగానే ఒక ఐపీవో నేడు తన బంపర్ లిస్టింగ్ కొనసాగించింది. వాస్తవానికి అంతర్జాతీయ పరిణామాలతో కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లతో ఈక్విటీ ఇన్వెస్టర్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ.. ఈ ఐపీవోపై బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు మాత్రం లాభాలను అందుకుని పండుగ చేస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కెఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ కంపెనీ ఐపీవో గురించే. మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో విజయవంతంగా జాబితా అయ్యింది. ఈ క్రమంలో 114 శాతం ప్రీమియంతో బీఎస్ఈలో షేర్లు రూ.470 రేటు వద్ద అడుగుపెట్టింది. ఇదే క్రమంలో ఎన్ఎస్ఈలో షేర్లు 118 శాతం ప్రీమియంతో ఒక్కోటి రూ.480 రేటు వద్ద జాబితా అయ్యాయి. లిస్టింగ్ తర్వాత సైతం కంపెనీ షేర్లకు బలమైన కొనుగోళ్ల డిమాండ్ కొనసాగటంతో ఇంట్రాడేలో గరిష్ఠంగా 125 శాతం పెరిగి షేర్ ధర రూ.497 స్థాయికి చేరుకుంది. దీంతో మార్కెట్లు ప్రతికూలంగా ఉన్నప్పటికీ బలమైన లిస్టింగ్ నమోదు చేయటంతో ఇన్వెస్టర్లు హ్యాపీగా ఉన్నారు.

కెఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ ఐపీవో సెప్టెంబర్ 25 నుంచి సెప్టెంబర్ 27 వరకు పెట్టుబడిదారుల కోసం తెరచి ఉంది. ఈ క్రమంలో కంపెనీ తన షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.209-220గా ఉంచింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.341.95 కోట్లను విజయవంతంగా సమీకరించింది. కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.100 కోట్లను సమీకరించింది. ఈ క్రమంలో లాట్ పరిమాణాన్ని 65 షేర్లుగా ఉంచటంతో ఇన్వెస్టర్లు కనీసం రూ.14,300 పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. మూడు రోజుల ఇష్యూ సమయంలో ఐపీవో 213.26 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 430.39 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ కేటగిరీ 253.04 రెట్లు, రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల కేటగిరీ 96.50 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
ఐపీవో ద్వారా కంపెనీ 1.55 కోట్ల ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్లకు విక్రయించింది. తాజా ఐపీవో నుంచి వచ్చే సొమ్ములో రూ.242.5 కోట్లను కంపెనీ రాజస్థాన్‌లోని నీమ్రానా, అల్వార్‌లో కొత్త తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ KRN HVAC ప్రోడక్ట్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు వినియోగించాలని నిర్ణయించింది. అలాగే మిగిలిన మెుత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు ఉపయోగించనుంది.
రైతు బిడ్డ స్థాయి నుంచి..
రాజస్థాన్‌లోని తిజారా అనే చిన్న పట్టణానికి చెందిన 44 ఏళ్ల కేఆర్‌ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ కంపెనీ యజమాని సంతోష్ కుమార్ యాదవ్ ప్రస్థానం అందరికీ ఆదర్శనీయంగా చెప్పుకోవచ్చు. ఒక రైతు బిడ్డ అయిన సంతోష్ తొలుత లాయిడ్ ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్‌లో ట్రైనీ ఆపరేటర్‌గా ఉండటం నుంచి KRN హీట్ ఎక్స్ఛేంజర్స్ అండ్ రిఫ్రిజిరేషన్ కంపెనీ లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా మారారు. 2013లో లాయిడ్ కంపెనీని విడిచిపెట్టి తన పెట్టుబడిదారుల సహకారంతో భివాడిలో మైక్రో కాయిల్స్ అండ్ రిఫ్రిజిరేషన్‌ను స్థాపించాడు. ఆ తర్వాత 2017లో కంపెనీలో తన వాటాను విక్రయించి KRN హీట్ ఎక్స్ఛేంజర్స్ అండ్ రిఫ్రిజిరేషన్‌ను ప్రారంభించాడు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications