KPI Green Energy: కేంద్ర ప్రభుత్వం సోలార్, విండ్ వంటి రెన్యూవబుల్ ఎనర్జీలపై దృష్టి సారించటంతో ఈ రంగంలోని కంపెనీ భారీగా లాభపడుతున్నాయి. ఐదేళ్ల కాలంలో కంపెనీ మల్టీబ్యాగర్ రాబడులను అందించి పెట్టుబడిదారులను కోటీశ్వరులుగా మార్చేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది KPI గ్రీన్ ఎనర్జీ కంపెనీ షేర్ల గురించే. ఎనర్జీ షేర్లు 5 ఏళ్లలో 9,600% కంటే ఎక్కువ రాబడిని అందుకున్నారు. ఈ కాలంలో కంపెనీ షేర్లు ఏకంగా రూ.9 నుంచి రూ.870 స్థాయికి పెరిగాయి. ఈ క్రమంలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లు ఐదేళ్ల కాలంలో కోటీశ్వరులుగా మారిపోయారు. ఈ కాలంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను సైతం అందించింది. KPI గ్రీన్ ఎనర్జీ తన వాటాదారులకు వరుసగా రెండుసార్లు బోనస్ షేర్లను ఇచ్చింది.

ఒకసారి ఎనర్జీ స్టాక్ ధర చరిత్రను పరిశీలిస్తే.. సెప్టెంబర్ 4, 2019న KPI గ్రీన్ ఎనర్జీ షేర్లు రూ.8.96కి రూ.2.9 కోట్లకు చేరాయి. కంపెనీ షేర్లు 6 సెప్టెంబర్ 2024న రూ.871.85 వద్ద ముగిశాయి. సెప్టెంబరు 4, 2019న కంపెనీ షేర్లలో లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే 11,160 షేర్లను పొందారు. ఆ తర్వాత జనవరి 2023లో కంపెనీ తన పెట్టుబడిదారులకు 1:1 నిష్పత్తిలో, ఫిబ్రవరి 2024లో 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించింది. దీంతో మెుత్తం షేర్ల సంఖ్య 33,480కి చేరింది. దీంతో వారి పెట్టుబడివిలువ రూ.2.91 కోట్లుగా ఉన్నాయి.
KPI గ్రీన్ ఎనర్జీ షేర్లు గత 2 ఏళ్లలో 473% పెరిగాయి. సోలార్ పవర్ కంపెనీ షేర్లు సెప్టెంబర్ 9, 2022న రూ.151.97 వద్ద ఉన్నాయి. అలాగే గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్లు తన ఇన్వెస్టర్లకు 210 శాతం పెరిగింది. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధరను పరిశీలిస్తే 1116గా ఉంది. ఇదే క్రమంలో 52 వారాల కనిష్ఠ ధర రూ.255.46 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications