KP Ramasamy: కాలేజీలో డ్రాపౌట్ స్టూడెంట్ వేల కోట్ల అధిపతిగా మారాడు..
ఫోర్బ్స్ భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాలో కొత్త ముఖాలలో టెక్స్‌టైల్స్, చక్కెర తయారీదారు KPR మిల్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ - 74 ఏళ్ల KP రామసామి(KP Ramasamy) ఒకరు. ఆయన రూ.19,133.7 కోట్ల నికర విలువతో జాబితాలో 100వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఒక రైతు కొడుకు, కాలేజీ డ్రాపౌట్ అయిన KP రామసామి భారతదేశంలోని అతిపెద్ద గార్మెంట్ ఎగుమతి సంస్థలలో ఒకదానిని స్థాపించడం ద్వారా విజయం సాధించారు. 1984లో స్థాపించిన KPR మిల్ వ్యాపారాన్ని 2013లో రామసామి విస్తరించారు. చక్కెర ఉత్పత్తికి విస్తరించారు.
2019లో ఆయన పురుషుల ఇన్నర్‌వేర్ బ్రాండ్ అయిన ఫాసోను కూడా ప్రారంభించాడు. KPR మిల్ అల్లిన దుస్తులు, పత్తి, పాలిస్టర్ నూలు ఉత్పత్తిలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది కాకుండా, KPR మిల్ చక్కెర, ఇథనాల్ తయారీలో కూడా ఉంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం KPR మిల్స్ వార్షికంగా 128 మిలియన్ వస్త్రాల ఉత్పత్తిని కలిగి ఉంది. వస్త్రాలు క్రీడా దుస్తులు, స్లీప్‌వేర్‌లతో సహా విస్తృత శ్రేణిని కలిగి ఉంటాయి. అవి ఎక్కువగా H&M, మార్క్స్ & స్పెన్సర్, వాల్‌మార్ట్ వంటి ప్రపంచ రిటైల్ దిగ్గజాల షెల్ఫ్‌లకు విక్రయిస్తున్నారు.

భారతదేశంలోని 100 మంది ధనవంతుల ఫోర్బ్స్ జాబితాలోని ఇతర కొత్త పేర్లను పరిశీలిస్తే, ఆసియన్ పెయింట్స్ డాని ఫ్యామిలీ రూ.67,841.77 కోట్ల నికర విలువను కలిగి ఉంది. అప్పు చేసి వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన 'రామసామి' వ్యాపారాన్ని చూసుకోవడానికి అతని కొడుకు 'ఆనందకృష్ణన్' విదేశాలను వదిలి ఇండియా చేరుకున్నారు. సంస్థ అభివృద్ధి కోసం తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్నారు.
ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ ఇండియా యొక్క 100 మంది సంపన్నుల జాబితా ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ $92 బిలియన్లతో మొదటి స్థానంలో నిలిచారు. అతని తర్వాతి స్థానంలో అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ నికర విలువ $68 బిలియన్లు, HCL వ్యవస్థాపకుడు శివ్ నాడార్ $29.3 బిలియన్ల నికర విలువతో తర్వాతి స్థానంలో ఉన్నారు.


Click it and Unblock the Notifications