IPO News: ఐపీవో షేర్లు పేలుడు లిస్టింగ్.. స్మాల్ క్యాప్ షేర్ లాభాల దాదాగిరి..!!

KP Green Engineering IPO: నేడు మార్కెట్లోకి మూడు ఐపీవోలు అడుగుపెట్టాయి. వీటిలో ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన కంపెనీలు అనూహ్యంగా మెరుగైన ప్రీమియం ధరకు అడుగుపెట్టాయి. ఈ క్రమంలో ఐపీవో ఏకంగా అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కేపి గ్రీన్ ఇంజనీరింగ్ కంపెనీ ఐపీవో గ్రాండ్ లిస్టింగ్ గురించే. వాస్తవానికి ఎస్ఎమ్ఈ కేటగిరీలో బీఎస్ఈలో జాబితా అయిన షేర్లు 38.88 శాతం ప్రీమియం రేటు రూ.200కు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో కొనుగోళ్లు పెరిగాయి. ఈ క్రమంలో స్టాక్ ఏకంగా తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. ఆ తర్వాత షేరు ధర రూ.210 స్థాయికి చేరుకుంది. కంపెనీ ఐపీవోపై పందెం వేసిన ఇన్వెస్టర్లు ఇప్పటివరకు 45.83 శాతం లాభాన్ని ఆర్జించారు.

KP Green Engineering IPO locked in upper circuit after bumper listing Investors celebrating

కేపి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఐపీవో మార్చి 15న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం తెరవబడింది. మార్చి 19 వరకు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు అందుబాటులో ఉంది. ఈ కాలంలో ఐపీవో 36 రెట్ల కంటే ఎక్కువ సబ్‌స్క్రిప్షన్‌ను పొందింది. చివరి రోజున అందుకున్న గరిష్ట సభ్యత్వం 29.50 రెట్లు నమోదైంది. ఈ క్రమంలో ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.137 నుంచి రూ.144గా ప్రకటించింది. లాట్ పరిమాణాన్ని 1000 షేర్లుగా నిర్ణయించటంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.1,44,000 పెట్టుబడిగా పెట్టారు.

కంపెనీ తాజా ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.189.50 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం ఏకంగా 131.60 లక్షల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. భారతదేశంలో పెరుగుతున్న ఉక్కు ఉత్పత్తి మధ్య విస్తరించిన ప్లాంట్‌లో కంపెనీ కొత్త ఉత్పత్తులను ప్లాన్ చేస్తోంది. 2001లో స్థాపించబడిన కంపెనీ హాట్-డిప్ గాల్వనైజ్డ్ స్టీల్ ఉత్పత్తుల తయారీలో నిమగ్నమై ఉంది. కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో లాటిస్ టవర్స్ స్ట్రక్చర్స్, సబ్‌స్టేషన్ స్ట్రక్చర్స్, సోలార్ మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్స్, కేబుల్ ట్రేలు, ఎర్తింగ్ స్ట్రిప్స్, బీమ్ క్రాష్ బారియర్స్ ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.720 కోట్లుగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+