Multibagger IPO Stock: గతేడాది అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హై స్థాయిలకు చేరుకున్నాయి. అయితే అప్పటి నుంచి విపరీతమైన అమ్మకాల ఒత్తిడి మార్కెట్లలో నెలకొంది. గతేడాది బుల్‌రన్ మార్కెట్‌లో ఐపీవోను మార్కెట్లోకి తీసుకొచ్చిన అనేక కంపెనీల షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. Paytm, Zomato నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన LIC వరకు అన్ని IPOలు పెట్టుబడిదారులను నిరాశపరిచాయి. వీటన్నింటి మధ్యలో.. తన విలువను పెంచుకున్న IPO ఒకటి ఉందని మీకు తెలుసా. ఇది కేవలం 7 నెలల్లోనే ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించడంలో విజయవంతమైంది.

ఐపీవో లిస్టింగ్ నుంచి ఇప్పటి వరకూ..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది కోట్యార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Kotyark Industries Ltd) IPO గురించి. గతేడాది అక్టోబర్‌లో ఈ కంపెనీ ఐపీవోగా మార్కెట్లోకి వచ్చింది. అక్టోబర్ 2021లో సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభించిన కోట్యార్క్ ఇండస్ట్రీస్.. IPO తర్వాత నవంబర్ 02న ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్ అయింది. ఇష్యూ సమయంలో షేర్ అప్పర్ బ్యాండ్ ప్రైస్ రూ.51గా ఉంది. ప్రస్తుతం జూన్ 13న దీని విలువ రూ.270గా ఉంది. మార్కెట్ ముగిసే సమయానికి షేర్ ధర రూ. 21.15 పతనమైంది. దాదాపు లిస్టింగ్ తరువాత ఏడు నెలల కాలంలో షేర్ విలువ దాదాపు 470 శాతం మేర పెరిగింది.

రాబడుల వివరాలు..
పెట్టుబడి పరంగా మాట్లాడినట్లయితే.. ఒక ఇన్వెస్టర్ కోట్యార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ IPOలో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే.. ప్రస్తుతం అతని పెట్టుబడి విలువ దాదాపు రూ. 5.80 లక్షలుగా ఉండేది. ఎన్‌ఎస్‌ఈ ఎక్స్ఛేంజీలో లిస్ట్ అయిన ఈ షేరు మొదటి రోజు మంచి పనితీరు కనబరిచింది. తొలిరోజు రూ.51 వద్ద లిస్టయి.. ట్రేడింగ్‌లో గరిష్ఠంగా రూ.51.90కి చేరగా, మార్కెట్ ముగిసే సమయానికి రూ.48.45కి దిగజారింది.

ఈ ఐపీవో మార్కెట్ పనితీరును బీట్ చేసింది..
ఈ స్టాక్‌ను విస్తృత మార్కెట్‌తో పోల్చి చూస్తే.. ఇది మార్కెట్‌ను భారీ మార్జిన్‌తో అధిగమించింది. కంపెనీ లిస్టింగ్ సమయమైన అక్టోబర్‌లో NSE నిఫ్టీ 18,604.45 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ దాదాపు 13 శాతం నష్టపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి చూసుకుంటే నిఫ్టీ సూచీ ఏకంగా 8 శాతానికి పైగా పతనమైంది. అయితే ఈ కాలంలో కోట్యార్క్ ఇండస్ట్రీస్ మాత్రం 291 శాతం పెరిగి మంచి పనితీరును కనబరిచింది. తన పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.


Click it and Unblock the Notifications