ఇటీవల ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం ప్రకటించింది. అయితే అందులో పాలసీ రేట్లను మార్చలేదు. కరోనా వైరస్/ మాంద్యం నేపథ్యంలో అలానే కొనసాగిస్తామని పేర్కొన్నది. ఈ సమయంలో కోటక్ మహీంద్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. హోం లోన్‌కి సంబంధించి వడ్డీరేట్లను మరింత తగ్గిస్తామని ప్రకటించి.. ఆయా విభాగాల్లో గల వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
హోం లోన్ వినియోగదారుల కోసం వడ్డీ రేట్ తగ్గించమని కోటక్ మహీంద్ర బ్యాంక్ తెలిపింది. ఇదే కాదు భవిష్యత్‌లో మరింత తగ్గిస్తామని పేర్కొన్నది. ఆర్బీఐ ద్రవ పరపతి ప్రకటించిన.. తాము వడ్డీ రేట్ల తగ్గించే ప్రక్రియ కొనసాగించాలని అనుకున్నామని వెల్లడించింది. ద్రవ్యోల్బణం, పెరుగుదల అలానే ఉంది అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ సీనియర్ ఎకనామిస్ట్, వైస్ ప్రెసిెడెంట్ సువొదీప్ రక్షిత్ తెలిపారు. ఇదీ 2021లో కంటిన్యూ అవుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

రూ.75 లక్షల హోం లోన్ తీసుకునే వారికి రూ.6.75 వడ్డీ రేటు ఉంటుందని కోటక్ మహీంద్ర తెలిపింది. ఇదీ అత్యంత తక్కువగా ఉంది అని వివరించింది. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలిచింది. కోటక్ మహీంద్రా కంటే 5 పాయింట్లు ఎక్కువగా లోన్ ఇస్తోందని బ్యాంక్ బజార్ తెలిపింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా క్యాపిటల్ ఆఫర్ 6.9 వడ్డీ ఇస్తోంది.
రూ.75 లక్షల వరకు హోం లోన్ ఇచ్చే ప్రభుత్వ/ ప్రైవేట్ బ్యాంకులు బీఎస్ఈలో లిస్టెడ్ అయి ఉంటాయి. వాటిని పరిశీలిస్తే.. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, నేషనల్ హౌసింగ్ బ్యాంకులు తమ జాబితాలో ఉంచాయి. ఆ వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్న బ్యాంకుల వివరాలు ఉంటేనే లోన్లు అందజేస్తాయి. లేకుంటే రుణం తీసుకునే విషయంలో పరిగణనలోకి తీసుకోవు.


Click it and Unblock the Notifications