Bank Fraud: కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో ఘరానా మోసం.. మేనేజర్ ఇళ్లపై ED దాడులు
Kotak Mahindra Bank: ప్రజాధనంతో డీల్ చేసే బ్యాంకుల్లో మోసాలు జరగడం దేశంలో కొత్తేమీ కాదు. అందుకే RBI కూడా పలు నిబంధనలు ప్రవేశపెడుతూ ఆర్థిక సంస్థలను నియంత్రిస్తూ ఉంటుంది. అయితే ఎన్ని చేసినా ఈ తరహా మోసాలకు చెక్ పడటం లేదు. గతంలో కోటక్ మహీంద్రా బ్యాంకులో జరిగిన స్కాంపై ED చర్యలకు దిగింది.
కోటక్ మహీంద్రా బ్యాంకులో గతంలో జరిగిన మోసంపై ED అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 31.93 కోట్లకు సంబంధించి బ్యాంక్ మేనేజర్ సుమిత్ కుమార్‌కు చెందిన మూడు చోట్ల ED దాడులు నిర్వహించింది. ఆయన సోదరుడు సౌరభ్ కుమార్‌ను అరెస్టు చేసి జనవరి 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపించింది.

నవంబర్ 2020లో జరిగిన 13 మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖాతాల నుంచి 31.93 కోట్లను అక్రమంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆర్థిక దుర్వినియోగం మరియు అవకతవకల నిగ్గు తేల్చేందుకు ED రంగంలోకి దిగింది.
పాట్నాలోని కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్ కమ్ డిస్ట్రిక్ట్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ (CALA కమ్ DLAO) ఖాతాల నుంచి ఈ నిధులు మాయమయ్యాయి. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూసేకరణ నిమిత్తం NHAIకి చెందిన నిధులు ఇందులో ఉన్నాయి. పాట్నా పోలీసులు FIR నమోదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అనధికార లావాదేవీలు మరియు సంభావ్య మనీలాండరింగ్ కార్యకలాపాలపై ED దర్యాప్తు ప్రముఖంగా దృష్టి కేంద్రీకరించింది.
ఈ మోసానికి సంబంధించి ప్రాథమిక లబ్ధిదారుల్లో సుమిత్ కుమార్ భార్య నీతా సింగ్ ఒకరిగా తెలుస్తోంది. జూలై 2019 నుంచి నీతా ఖాతాకు మొత్తం 9 కోట్ల మేర నిధులు బదిలీ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పాట్నా DLAO పంకజ్ పటేల్ పేరిట నకిలీ ఆధార్ కార్డు సృష్టించి పత్రాలు తారుమారు చేశారని సమాచారం.


Click it and Unblock the Notifications