Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
కోటక్ మహీంద్రా బ్యాంక్ కొంపముంచింది. గురువారం బ్యాంక్ షేర్లు 10 శాతం పడిపోయాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆంక్షాలు విధించడంతో స్టాక్ లో ఒత్తిడి కనిపించింది. ఆన్‌లైన్ క్లయింట్‌లను ఆన్‌బోర్డింగ్ ఆపాలని ఆర్బీఐ బ్యాంకును ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకూడదని స్పష్టం చేసింది. ఆర్బీఐ ఆదేశాలు బ్యాంకు నష్టం కలిగించేవిగా ఉండడంతో స్టాక్ 10 శాతం పడిపోయింది.
ఆర్బీఐ చర్య కోటక్ బ్యాంక్‌కు భారీ ఎదురు దెబ్బ అని నిపుణులు చెబుతున్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ దాని 811 డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారీ సంఖ్యలో సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బ్యాంక్ డిజిటల్ విభాగం ద్వారా సంవత్సరం 40 వృద్ధిని నమోదు చేస్తోంది. అయితే ఆన్ ఖాతాల ఓపెనింగ్ చేస్తున్న క్రమంలో బ్యాంక్ సరైన నిబంధనలు పాటించలేదని ఆర్బీఐ గుర్తించింది. బ్యాంకును హెచ్చరించింది కూడా. కానీ బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆర్బీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.

ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంకు వృద్ధి, నికర వడ్డీ మార్జిన్, ఫీజు ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంక్షాల తర్వాత, కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై 'హోల్డ్' రేటింగ్‌ను కలిగి ఉన్న జెఫరీస్, దాని టార్గెట్ ధరను రూ. 2,050 నుంచి రూ.1,970కి తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న చర్యలు ఆడిట్, రిజల్యూషన్ ప్రక్రియ తర్వాత తిరిగి సమీక్షించే అవకాశం ఉఁది.
డిజిటల్ ఆన్‌బోర్డింగ్‌పై నిషేధం మధ్యకాలంలో బ్యాంక్ వృద్ధి అవకాశాలకు ఆటంకం కలిగిస్తుందని భావిస్తున్నారు. అదనంగా, గత నాలుగు సంవత్సరాలలో 350 కంటే తక్కువ శాఖలు జోడించబడిన కొత్త శాఖలను తెరవడానికి బ్యాంక్ విముఖత చూపడం మరో సవాలుగా మారిందని మాక్వేరీ పేర్కొంది. పేరు చెప్పడానికి ఇష్టపడని బ్యాంకింగ్ ఫండ్ మేనేజర్, కోటక్ బ్యాంక్ స్టాక్ ధరలో 5 శాతం వరకు కరెక్షన్ ఉంటుందని అంచనా వేశారు. కానీ స్టాక్ 10 శాతం పడిపోయింది.


Click it and Unblock the Notifications