Kotak Mahindra Bank: ప్రస్తుతం దేశంలోని కార్పొరేట్ కంపెనీలు తమ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో అనేక బ్యాంకింగ్ సంస్థలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి.
తాజాగా రెండవ త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ.13,507.40 కోట్ల వ్యాపార ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.12,868.93 కోట్ల కంటే 36 శాతం అధికం. అలాగే పన్నుల తర్వాత నికర లాభం సైతం 24 శాతం పెరిగి రూ.3,191 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్(NIM) 5.22 శాతంగా ఉంది. అలాగే నికర వడ్డీ ఆదాయం(NII) ఏడాదికి 23.5 శాతం పెరిగి రూ.6,297 కోట్లకు చేరుకుంది.

ఇక స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి సెప్టెంబర్ చివరి నాటికి 1.72 శాతంగా నమోదైంది. త్రైమాసికంలో వార్షిక ఆస్తులపై రాబడి(RoA) 2.68 శాతంగా ఉంది. ఇది ఏడాది క్రితం 2.61 శాతంగా ఉంది. ఈ త్రైమాసికంలో ఈక్విటీపై రాబడి(RoE) 14.99 శాతంగా నమోదైంది. అలాగే సెప్టెంబర్ చివరి నాటికి గ్రూప్ నిర్వహణలో ఉన్న మెుత్తం ఆస్తుల విలువ రూ.4.98 లక్షల కోట్లుగా ఉంది. అలాగే సెప్టెంబర్ చివరి నాటికి కరెంట్ ఖాతా పొదుపు ఖాతా(CASA) నిష్పత్తి 48.3 శాతంగా ఉంది. త్రైమాసికంలో సగటు కరెంట్ డిపాజిట్లు రూ.58,351 కోట్లకు పెరిగాయి.
సెప్టెంబర్ 30 నాటికి కోటక్ బ్యాంక్ సగటు పొదుపు డిపాజిట్లు రూ.1.22 లక్షల కోట్లుగా ఉన్నాయి. సగటు టర్మ్ డిపాజిట్ ఏడాదికి 47 శాతం పెరిగి రూ.1.39 లక్షల కోట్లకు చేరుకుంది. ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. స్టాక్‌బాక్స్ బ్రోకరేజ్‌లోని విశ్లేషకులు కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభం 24.2 శాతం పెరిగి రూ.3,205 కోట్లకు చేరుకుంటుందని, ఎన్‌ఐఐలో 24.7 శాతం పెరిగి రూ.6,358 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.


Click it and Unblock the Notifications