ప్రయివేటురంగ మూడో దిగ్గజ బ్యాంకు కొటక్ మహీంద్రా 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన లాభాలు 26.27 శాతం పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో స్టాండలోన్ నెట్ ప్రాఫిట్ రూ.2,184.48 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,724.48 కోట్లుగా ఉంది. అంచనాలకు మించి లాభాలు నమోదు చేసింది.
నికర వడ్డీ ఆదాయం 16.8 శాతం పెరిగి రూ.3,913 కోట్లను దాటింది. గత ఏఢాది రూ.3,350 కోట్లుగా ఉంది. లోన్ బుక్ 4 శాతం క్షీణించి రూ.2.04 లక్షల కోట్లను తాకింది. డిపాజిట్లు 12 శాతం పెరిగి రూ.2.61 లక్షల కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ క్వార్టర్ ముగిసే సమయానికి గ్రాస్ ఎన్పీఏలు 2.55 శాతంగా ఉంది. నెట్ ఎన్పీఏలు 0.64 శాతంగా ఉంది. నికర వడ్డీ మార్జీన్లు 4.61 శాతం నుండి 4.52 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 9.6 శాతం క్షీణించి రూ.369 కోట్లుగా ఉంది.

సగటు సేవింగ్స్ డిపాజిట్స్ 32 శాతం పెరిగి రూ.1,06,442గా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో రూ.80,425 కోట్లుగా నమోదయింది. సగటు కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 10 శాతం పెరిగి రూ.33,216 (గత ఏడాది ఇదే కాలంలో) నుండి రూ.36,610 కోట్లకు పెరిగింది. కస్టమర్ అసెట్స్ గత ఏడాది ఇదే కాలంలో రూ.2,23,305 కోట్లు కాగా, ఈసారి రూ.2,18,790 కోట్లుగా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications