ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్ తన మార్చి త్రైమాసికం ఫలితాలను పోస్ట్ చేసింది. ఏకీకృత నికర లాభం 14.29 శాతం పెరిగి 4 వేల 566 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ప్రధాన పెరామీటర్స్ ను పరిశీలిస్తే మంచి పనితీరును కనబరిచినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పన్ను అనంతర నికర లాభం 34 శాతం పెరిగి 3 వేల 496 కోట్లకు చేరుకుంది. అనుబంధ సంస్థల పనితీరు లాభాల వృద్ధిని పరిమితం చేసినట్లు తెలుస్తోంది.
FY23లో బ్యాంక్ నికర లాభం స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన 10 వేల 939 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇది 8 వేల 573 కోట్లకు పరిమితమైంది. దాని ప్రధాన నికర వడ్డీ ఆదాయం 35 శాతం పెరిగి 6 వేల 103 కోట్లకు చేరింది. అడ్వాన్ స్‌లలో 18 శాతం పెరుగుదల మరియు నికర వడ్డీ మార్జిన్‌లో విస్తరణ భారీగా 5.75 శాతానికి ఎగబాకింది. ఇతర ఆదాయమూ 2 వేల 186 కోట్లతో 30 శాతం వృద్ధి సాధించింది. ఇది అంతకు ముందు సంవత్సరం 1,705 కోట్లు మరియు డిసెంబర్ త్రైమాసికంలో 1,948 కోట్లుగా నమోదైంది.

RBI వడ్డీ రేట్లను పదేపదే పెంచడం వల్ల మార్జిన్‌లు లాభపడ్డాయని కొటక్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైమిన్ భట్ తెలిపారు. సంస్థ రుణాలలో మంచి భాగం రెపో రేటు బాహ్య బెంచ్ మార్క్ తో అనుసంధానించబడిందని గుర్తు చేశారు. ఇది 5.75 శాతం గరిష్ట స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే, తామెప్పుడూ ఎక్కువ మార్జిన్ కలిగి ఉంటామన్నారు. దీనిని 5 శాతం మార్కు కంటే ఎక్కువగా ఉంచడమే తమ లక్ష్యమని వివరించారు.
బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ నామమాత్రపు వృద్ధి కంటే 1.5-2 రెట్లు పెరుగుతుందని మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ కోటక్ వెల్లడించారు. ఇది 11 శాతానికి పైగా ఉంటుందని అంచనా వేశారు. కార్పొరేట్ క్రెడిట్ వృద్ధి 15-20 శాతంగా ఉంటుందన్నారు. Q4 త్రైమాసికంలో కార్పొరేట్ రుణ పోర్ట్‌ఫోలియో 1 శాతం పెరిగినట్లు చెప్పారు. ఈ విషయంలో కార్పొరేట్ రంగం అంత బలంగా లేదని ప్రెసిడెంట్ KVS మణియన్ అభిప్రాయపడ్డారు. బ్యాంక్ ప్రస్తుతం మార్కెట్‌లో 'ధరల ఒత్తిడి'కి లోనవుతున్నట్లు తెలిపారు.

తనఖా రుణాల విభాగంలో 22 శాతం పెరుగుదల కనిపించినప్పటికీ, బ్యాంక్ వృద్ధి మాత్రం ఫ్లాట్ గా ఉన్నట్లు రిటైల్ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్న శాంతి ఏకాంబరం చెప్పారు. లగ్జరీ హౌసింగ్‌కు డిమాండ్ ఎక్కువగానే కొనసాగుతోందని, అదే సమయంలో తక్కువ ధర ఉన్న వాటిపై ప్రభావం పడిందని వెల్లడించారు. పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా ఫ్లాట్ యజమానులు పునరాలోచించాల్సి వస్తోందన్నారు.
అసెట్ క్వాలిటీ పరంగా చూస్తే బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.34 శాతం నుండి 1.78 శాతానికి తగ్గగా.. త్రైమాసిక వ్యవధిలో 1.90 శాతానికి మెరుగుపడటంతో శుభ సూచకం. గత త్రైమాసికంలో 148 కోట్లుగా ఉన్న ఖర్చులు 147 కోట్లకు తగ్గాయి. తద్వారా కోటక్ క్రెడిట్ ఖర్చులు పరిశ్రమలో అత్యల్పంగా ఉన్నాయని తెలుస్తోంది. మార్చి 31, 2023 నాటికి బ్యాంక్ మొత్తం మూలధన సమృద్ధి 21.80 శాతంగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications