కరోనా వైరస్ మార్కెట్లపై పెను ప్రభావం చూపించింది. బ్యాంకులు కొత్త రుణాల విషయంలో ఆచి తూచి మరీ అడుగేస్తున్నాయి. అయితే ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా మాత్రం డెబిట్ కార్డు ఉంటేనే లోన్ ఇస్తామని చెబుతోంది. రుణం ఇవ్వడమే కాకుండా ఈఎంఐ సౌలభ్యం కూడా అందజేస్తోంది. అయితే డెబిట్ కార్డు యూజర్స్ ఇన్నొవిటి పీఓఎస్ టర్మినల్స్ వద్ద మాత్రమే స్వైప్ చేస్తే రుణ సదుపాయం పొందే వీలు ఉంటుంది.
కోటక్ మహీంద్రా బ్యాంకుకు కోటి మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. వీరందరికీ డెబిట్ కార్డు ఉంది. ఒకవేళ ఎవరైనా అవసరం ఉంది అనుకుంటే లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. రుణం కోసం ప్రయత్నిస్తోన్న వారికి ఈ సదుపాయం వరంగా మారనుంది. దేశవ్యాప్తంగా 1000 పట్టణాల్లో 70 వేలకు పైగా ఇన్నొవిటి టర్మినల్స్ అందుబాటులో ఉన్నాయి. సదరు యూనిట్ వద్ద వినియోగదారులు లోన్ విషయం, ఈఎంఐ గురించి ముందుగానే క్యాషియర్‌కు చెప్పాల్సి ఉంటుంది.

షాపింగ్‌కు వచ్చిన సమయంలో ఎన్ని నెలలు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటున్నారో ముందుగా తెలియజేయాలి. ఆ తర్వాతే లావాదేవీ నిర్వహించాలి. తొలుత కార్డు ఇన్నొవిటీ పీవోఎస్ టర్మినల్‌లో స్వైప్ చేయాలని.. వెంటనే ఇన్‌స్టంట్ లోన్ మంజూరవుతోందని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications