Kotak Mahindra Bank: రిజర్వు బ్యాంక్ తాజా చర్యలతో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు గురువారం మార్కెట్లో పతనమయ్యాయి. ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 12 శాతం మేర క్షీణతను నమోదు చేశాయి. ఇది పరోక్షంగా బ్యాంక్ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ ఉదయ్ కోటక్‌కు భారీగానే నష్టాన్ని కలిగించింది.
దీంతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఉదయ్ కోటక్ సంపద 1.3 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది. స్టాక్ పతనం తర్వాత ఉదయ్ కోటక్ నికర విలువ 14.4 బిలియన్ డాలర్లుగా కొనసాగుతోంది. ఆయన ఆసియాలోనే అత్యంత ధనిక బ్యాంకర్. మార్కెట్లు ముగిసే సమయంలో బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు 10.85 శాతం పడిపోయి రూ.1,643 వద్ద ప్రయాణాన్ని ముగించాయి. ఇంట్రాడేలో స్టాక్ గరిష్ఠంగా 12.10 శాతం క్షీణతకు లోనై తన 52 వారాల కనిష్ట స్థాయి రూ.1,620కి చేరుకుంది. ఇదే క్రమంలో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10.73 శాతం నష్టంతో రూ.1,645 వద్ద ముగిశాయి.

గురువారం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ పతనం తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.39,768.36 కోట్లు తగ్గి రూ.3,26,615.40 కోట్లకు చేరుకుంది. యాక్సిస్ బ్యాంక్ ఇప్పుడు మార్కెట్ క్యాప్ పరంగా దేశంలో నాల్గవ అత్యంత విలువైన బ్యాంకుగా అవతరించింది. యాక్సిస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.3,48,014.45 కోట్లుగా ఉంది.
వాస్తవానికి బుధవారం మార్కెట్ ట్రేడింగ్ ముగింపు తర్వాత.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడం ద్వారా కొత్త కస్టమర్‌లను జోడించకుండా బ్యాంకులను తక్షణమే నిషేధించింది. ఐటీ నిబంధనలను పదేపదే పాటించని కారణంగా చర్యలు తీసుకున్నట్లు సెంట్రల్ బ్యాంక్ వివరణ ఇచ్చింది. బ్యాంక్ ఐటీ రిస్క్ మేనేజ్‌మెంట్‌లో ఆర్బీఐ తీవ్రమైన లోపాలను గుర్తించింది.
ఇటీవల అశోక్ వాస్వానీ కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. వ్యవస్థాపక డైరెక్టర్ ఉదయ్ కోటక్ సెప్టెంబరు 1, 2023 నుంచి బ్యాంక్ చీఫ్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్, CEO అయిన దీపక్ గుప్తా స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఉదయ్ కోటక్ లాగానే ఆయన కూడా సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి. వాస్వానీ చార్టర్డ్ అకౌంటెంట్ & కంపెనీ సెక్రటరీ కూడా.


Click it and Unblock the Notifications