సోమవారం దుమ్మురేపనున్న Kotak Bank స్టాక్.. క్యూ2 ఫలితాలతో పాటు రూ.4,100 కోట్ల డీల్..
Kotak Mahindra Bank: దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం కోటక్ మహీంద్రా బ్యాంక్ కంపెనీ షేర్లు ఫోకస్ లో కొనసాగనున్నాయి. అయితే దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ షేర్లను భారీగా ప్రేరేపించటానికి ఇవి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.
దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ పెరుగుదలకు కారణమైన మెుదటి అంశాన్ని పరిశీలిస్తే.. కోటక్ బ్యాంక్ ప్రముఖ బ్రిటీష్ బ్యాంకింగ్ కంపెనీ స్టాండర్డ్ చార్టర్డ్‌కి చెందిన రూ.4,100 కోట్ల పర్సనల్ లోన్ పోర్ట్ ఫోలియోనుకొనుగోలు చేయనున్నట్లు ప్రకటించటమే. అయితే ఈ డీల్ ఎంత విలువకు జరుగుతుందనే విషయాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డీల్ కింద విదేశీ రుణగ్రహీతల పర్సనల్ లోన్స్‌ను కోటక్ బ్యాంక్ కొనుగోలు చేస్తుంది. రానున్న మూడు నెలల కాలంలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉందని వెల్లడైంది. దీనికి ముందు సిటీ బ్యాంక్ తన భారతీయ రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకుకు విక్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇటువంటి డీల్ విదేశీ బ్యాంకుతో కోటక్ చేయబోతోంది.

Q2 ఫలితాలు..
కోటక్ మహీంద్రా బ్యాంక్ నేడు సెప్టెంబరుతో ముగిసిన రెండవ త్రైమాసికంలో రూ.3,344 కోట్ల నికర లాభాన్ని రిపోర్ట్ చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నమోదు చేసిన రూ.3190 కోట్ల నికర లాభం కంటే ఇది దాదాపు 4.8 శాతం అధికం. ప్రస్తుత ఫలితాలు బ్రోకరేజీ అంచనాలకు చాలా దగ్గర వరకు వచ్చాయి. ఇదే క్రమంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 11 శాతం వృద్ధితో రూ.7019.3 కోట్లుగా నమోదైంది. ఇదే క్రమంలో నికర వడ్డీ మార్జిన్ గత ఏడాది రెండవ త్రైమాసికం ముగింపులో నమోదైన 5.22 శాతం నుంచి ప్రస్తుతం 4.91 శాతానికి తగ్గింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 13 శాతం వృద్ధి చెంది రూ.5,044 కోట్లకు చేరింది.
ఇటీవలి కాలంలో దేశీయంగా అనేక సంస్థలు విదేశీ బ్రాండ్ల వ్యాపారాలను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇండియా నుంచి ఫోర్డ్ నిష్క్రమించాలని చూస్తుండగా.. ఫోర్డ్ గుజరాత్ ఫ్యాక్టరీని టాటా మోటార్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవల మరో ఆటో దిగ్గజం స్కోడా మహీంద్రా అండ్ మహీంద్రాతో జతకట్టిన సంగతి తెలిసిందే. అలాగే ఎంజీ మోటార్స్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ తో చేతులు కలిపిన సంగతి కూడా మనం చూశాం.
గత ఏడాది ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ హోల్ సేల్ కిరాణా వ్యాపారంలో ఉన్న జర్మన్ బ్రాండ్ మెట్రో స్టోర్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దేశంలో అధిక పోటీ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో అనేక విదేశీ సంస్థలు తమ భారతీయ వ్యాపారాలను విక్రయించి తప్పుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశంల్లో సహజంగా విదేశీ సంస్థలు మంచి లాభాల మార్జిన్ కోసం వ్యాపారాలను ప్రారంభిస్తాయని మనందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు ఇది రివర్స్ గేర్ లో ఇండియాలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications