Kotak Mahindra Bank: RBI ఆంక్షలపై స్పందించిన కోటక్ బ్యాంక్ MD.. ఆర్థిక పరమైన డ్యామేజ్ తక్కువే కానీ..
RBI News: దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నియంత్రించబడుతూ ఉంటాయి. ఇటీవల పేటీఎం సహా పలు ఇతర బ్యాంకులు, NBFCలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ వ్యవహారంపై బ్యాంక్ CEO స్పందించారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ విధించిన వ్యాపార ఆంక్షలు అత్యల్ప ఆర్థిక ప్రభావాన్ని చూపుతాయని బ్యాంక్ భావిస్తోంది. అయితే ప్రతిష్ట దెబ్బతినడం గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నట్లు బ్యాంక్ ప్రతినిధి తెలిపారు. ఇవి 2 నెలల పాటు కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశోక్ వస్వానీ పేర్కొన్నారు.

తన ఆన్‌లైన్ మరియు మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్‌ల ద్వారా కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డింగ్ చేయకుండా కోటక్ మహీంద్రా బ్యాంక్‌ను ఆర్బీఐ గత నెలలో నిషేధించింది. దాని IT రిస్క్ మేనేజ్‌మెంట్‌లో లోపం ఉన్నట్లు నియంత్రణ సంస్థ గుర్తించడంతో ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని అప్పుడే స్పష్టం చేసింది. ఈ వ్యవహారం టెక్ రంగంలో తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తోందని, రుణదాతల విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.
క్రెడిట్ కార్డ్ వ్యాపారం సహా దాని డిజిటల్ బ్యాంకింగ్-కేంద్రీకృత 811 వ్యాపారాలు సజావుగా సాగకపోవడం బ్యాంక్ పై తప్పకుండా చెడు ప్రభావం చూపుతుందని అశోక్ అంగీకరించారు. 'అయితే ఆర్థిక ప్రభావం కంటే బ్యాంక్ ఇమేజ్ గురించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాను. ఆర్బీఐ సూచన మేరకు IT నిర్వహణను పరిశీలించేందుకు బాహ్య ఆడిటర్‌ను కూడా నియమించుకోనున్నాము' అని వస్వానీ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications