దక్షిణ కొరియాకు చెందిన గ్లోబల్ ఫుట్వేర్ దిగ్గజం హ్వాస్యుంగ్ భారత మార్కెట్లోకి భారీ అడుగు వేయడానికి సిద్ధమైంది. తోలుయేతర స్పోర్ట్స్ షూ తయారీ యూనిట్ స్థాపన కోసం కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో 150 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. అడిడాస్ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లకు కీలక సరఫరాదారుగా ఉన్న హ్వాస్యూంగ్, ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేక ప్రాధాన్యంతో చూస్తోంది. ఇది భారతదేశంలో కంపెనీ తొలి పెట్టుబడి.
ప్రస్తుతం ఇది దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం, ఇండోనేషియా, చైనా వంటి దేశాల్లో ఫుట్‌వేర్ తయారీ సౌకర్యాలను విజయవంతంగా నిర్వహిస్తోంది ఈ గ్లోబల్ ప్లేయర్. ఆసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశం యువ జనాభా, నైపుణ్యాలు, ఇంజనీరింగ్ టాలెంట్, స్థిరమైన పెట్టుబడి వాతావరణం వంటి అంశాల్లో ముందంజలో ఉందని కంపెనీ స్పష్టంగా భావించింది. హ్వాస్యుంగ్ ఫుట్‌వేర్ విభాగం CEO బాబ్ షోర్రాక్ మాట్లాడుతూ.. మా పెట్టుబడి పూర్తిగా ఉపాధి మీదే దృష్టి పెట్టుకుంది.

మూడు దశలు పూర్తి అయ్యే సరికి దాదాపు 20 వేల మంది ఉద్యోగులు పనిచేసే భారీ పరిశ్రమగా ఇది మారుతుందని అన్నారు. సంవత్సరానికి 20 మిలియన్ జతల స్పోర్ట్స్ షూలను ఈ యూనిట్ తయారు చేస్తుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉత్పత్తి ఎక్కువగా ఎగుమతుల కోసం ఉంచినా..భవిష్యత్తులో భారత మార్కెట్‌లో కూడా సరఫరాలను పెంచే వ్యూహం ఉంది.
ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నియోజకవర్గమైన కుప్పంలో రెండు గ్రామాల్లో 100 ఎకరాల భూమి కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆగస్టులో తమిళనాడు ప్రభుత్వంతో ఒక ప్లాంట్ ఏర్పాటుకు ఎంఓయూ సంతకం చేసిన హ్వాస్యుంగ్, లోతైన పరిశీలన తర్వాత చివరకు ఆంధ్రప్రదేశ్‌ను ఎన్నుకోవడం పరిశ్రమల రంగంలో చర్చనీయాంశమైంది.
పెట్టుబడి కోసం సరైన దేశం, సరైన రాష్ట్రం ఎంపిక చేసుకోవడానికి Hwaseong అనేక అంశాలను విశ్లేషించింది. మాది శ్రమతో కూడిన పరిశ్రమ. ఆటోమేషన్ ఉన్నప్పటికీ మాకు పెద్ద సంఖ్యలో శ్రామిక శక్తి అవసరం అవుతుందని షోర్రాక్ తెలిపారు. పెద్ద యువ జనాభా, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణుల లభ్యత, నైపుణ్య అభివృద్ధికి మంచి అవకాశం ఉండటంతో భారతదేశం అత్యంత అనుకూల గమ్యస్థానంగా నిలిచిందన్నారు.
కంపెనీ ఇన్వెస్ట్ ఇండియాతో సంప్రదింపులు జరిపిన తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రెండింటినీ పరిశీలించింది. మొదట తమిళనాడుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఆ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డుతో విస్తృతంగా చర్చించిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెడితే తమ వ్యాపార నమూనాకు మరింత అనుకూలమని నిర్ణయించారు. రెండు రాష్ట్రాలు మంచి భూభాగం, సమృద్ధిగా శ్రామిక శక్తి, స్పష్టమైన పరిశ్రమా విధానాలను అందిస్తున్నప్పటికీ, మొత్తం ప్రాజెక్ట్ అవసరాలకు సరిపోయేది ఆంధ్రప్రదేశ్ అని కంపెనీ తేల్చింది.
More From GoodReturns

Amaravati: ఒకే ఒక్క ప్రాజెక్ట్.. లక్షన్నర కోట్ల పెట్టుబడి! ఏపీ తలరాత మారబోతోందా?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications