80 ఏళ్ళ తరువాత కేజీఎఫ్ బంగారు గనులు రీఓపెన్..మన బంగారం ఆకలి తీరినట్లే ఇక..

Kolar Gold Fields: భారతదేశంలో అతి పెద్ద బంగారు గని గురించి ఎవరికైనా తెలుసా.. స్వాతంత్ర్యానికి పూర్వం ఈ బంగారు గని భారత దేశంలో ఉంది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న నగరమే KGF.. కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు క్షేత్రాలు కలిగిన నగం. KGFను ఒకప్పుడు 'బంగారు నగరం' 'మినీ ఇంగ్లాండ్' అని పిలిచేవారు.

బెంగళూరు నుండి దాదాపు 100 కి.మీ దూరంలో ఉన్ననగరం చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. బంగారానికి ప్రసిద్ధి చెందిన నగరంగా నిలిచింది. దీనిపై సినిమా కూడా వచ్చింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొదించిన ఈ సినిమానే కేజీఎఫ్. సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని కూడా అందుకుంది.

కేజీఎఫ్ గనులు రీఓపెన్ : తాజాగా ఈ కేజీఎఫ్ గనులను కేంద్రం రీఓపెన్ చేయబోతుందనే వార్తలు బయటకు వచ్చాయి. ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ దీనికి సంబంధించిన వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి.దాదాపు 80 సంవత్సరాల తర్వాత..అంటే రెండు దశాబ్దాలకు పైగా మూసివేయబడిన ఈ గనులును ప్రభుత్వం తిరిగి రీఓపెన్ చేయనెందనేది వార్తల సారాంశం.

KGF reopening Kolar Gold Fields India gold mining KGF gold production KGF history Karnataka gold mines gold mining India iconic gold mine KGF revival news KGF gold output Indian mining sector gold reserves India KGF 750 kg gold gold rush India reopening of KGF 750 Kolar Gold Fields Revived

1880 నుండి 2001 వరకు 121 సంవత్సరాల కాలంలో బ్రిటిష్ పాలకులు, భారత ప్రభుత్వం KGF నుండి 900 టన్నులకు పైగా బంగారాన్ని వెలికితీశాయి.బ్రిటీష్ పాలకులను ఈ బంగారమే అత్యంత ధనవంతులను చేసింది.అయితే 2001లో ఇక్కడ బంగారు తవ్వకం నిషేధించబడింది.

దేశం లక్షల కోట్ల ప్రయోజనాన్ని పొందే అవకాశం : తాజాగా కర్ణాటకలోని ఈ కోలార్ బంగారు క్షేత్రాలు (KGF) 79 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెరుస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. స్వాతంత్ర్యం తర్వాత ఈ బంగారు గని మళ్ళీ తెరుస్తున్నారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్న బంగారు నిల్వలు వెలికి తీసినట్లయితే.. దేశం లక్షల కోట్ల ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. ఈ కేజీఎఫ్ బంగారు గని (KGF) నుండి ఏటా దాదాపు 750 కిలోల బంగారాన్ని వెలికి తీయవచ్చు.

ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి వినియోగదారు : ఇదే జరిగితే భారతదేశం బంగారం కొనుగోలు కోసం ఇతర దేశాలపై ఆధారపడటం చాలావరకు తగ్గుతుంది. ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి వినియోగదారు అవుతుంది. ప్రస్తుతం దేశంలో బంగారు ఆభరణాలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో భారత్ ప్రతి సంవత్సరం వందల టన్నుల బంగారాన్ని పక్కదేశాల నుంచి కొనుగోలు చేస్తోంది. అయితే KGF కనుక లైవ్ లోకి వస్తే లక్షల కోట్ల రూపాయలు ఆదా అవడమే కాకుండా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బాధ కూడా తప్పుతుంది.

23 టన్నుల తిరిగి పొందగలిగే బంగారం: జూన్ 2024లో KGF వద్ద భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (BGML) దాదాపు 1,003 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 13 టైలింగ్ డంప్‌లపై MMDR చట్టం ప్రకారం మైనింగ్ పునఃప్రారంభించాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇక ఇక్కడ దాదాపు 32 మిలియన్ టన్నుల మెటీరియల్ గ్రేడింగ్ బంగారం ఉందని, అంటే దాదాపు 23 టన్నుల తిరిగి పొందగలిగే బంగారం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏటా దాదాపు 750 కిలోల బంగారం ఇక్కడ నుంచి తవ్వి వెలుగులోకి తీసుకురావొచ్చు. కాగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా కొత్త బంగారం ఉత్పత్తి జరగడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు.

కోలార్‌లో బంగారు నిల్వల ప్రస్తావన చోళ సామ్రాజ్యంలో మనకు కనిపిస్తుంది. చోళ సామ్రాజ్యంలో 1004 నుండి 1116 వరకు ఉన్న శాసనాలు, పుస్తకాలలోఈ నగరంలో బంగారు తవ్వకం గురించి ప్రస్తావించబడింది. విజయనగర రాజవంశం సమయంలో కూడా ఇక్కడ బంగారం తవ్వినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ కూడా 1750- 1760ల మధ్య బంగారు గనిని ఉపయోగించాడని శాసనాల్లో ప్రస్తావించారు. 1902లో KGFలో 95 శాతం బంగారం వెలికితీసినట్లు సమాచారం. 1930 నాటికి దాదాపు 30 వేల మంది కార్మికులు ఈ గనిలో తవ్వకాలు ప్రారంభించారని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది.

కోలార్ బంగారు క్షేత్రాలలో తవ్వకాలు : భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ల ఆధిపత్యం తర్వాత.. లెఫ్టినెంట్ జాన్ వారెన్ 1802 సంవత్సరం నుండి కోలార్ గనులలో బంగారు నిల్వలను తవ్వడం ప్రారంభించాడని తెలుస్తోంది. 1804- 1860 మధ్య కాలంలో కోలార్ బంగారు క్షేత్రాలలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 1880లో ఆంగ్ల కంపెనీ కోలార్‌లో బంగారాన్ని తవ్వడం ప్రారంభించగా.. 1943 నాటికి KGF నుండి 583 టన్నుల బంగారాన్ని తవ్వి ఖజానాను బంగారంతో నింపుకుంది బ్రిటీష్ కంపెనీ. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత KGF భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

ఈ బంగారు గనిని 1956లో జాతీయం చేశారు. భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ 1970లో ఇక్కడ బంగారాన్ని తవ్వడం ప్రారంభించింది.అయితే ప్రారంభంలో ఈ గనుల నుండి ప్రభుత్వం ప్రయోజనం పొందినా.. 1980 నాటికి కంపెనీ నష్టాలు మొదలయ్యాయి. కార్మికులకు జీతాలు ఇవ్వడానికి కూడా కంపెనీ అష్టకష్టాలు పడింది. దీంతో 2001 సంవత్సరంలో ఇక్కడ తవ్వకాలు ఆగిపోయాయి. దీని తరువాత, కోలార్ బంగారు క్షేత్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. KGF లో ఇంకా బంగారం ఉందని మీడియా నివేదికలు ఎప్పటికప్పుడు చెబుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+