For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rocket Stock: రాకెట్ లాగా దూసుకెళ్తున్న షిప్పింగ్ స్టాక్.. లక్షను ఏడాదిలో రూ.12.50 లక్షలుగా మార్చింది..

|

Multibagger Stock: చిన్న పెట్టుబడితో పెద్ద లాభాలు అనే మాట వినటానికి బాగానే ఉంటుంది మరి నిజంగా వస్తాయా అని అనుమానం సహజమే. ఇది స్టాక్ మార్కెట్లో సాధ్యమా బాస్ అంటే కొన్ని స్టాక్స్ సాక్ష్యం మేమే అని అంటున్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న షేర్ ఏకంగా 1000 శాతానికి పైగా రాబడిని అందించి ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.

షిప్పింగ్ కంపెనీ..

షిప్పింగ్ కంపెనీ..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది నాలెడ్జ్ మెరైన్ & ఇంజినీరింగ్ వర్క్స్(KMEW) షేర్ గురించే. ప్రస్తుతం ఈ స్టాక్ ఈ రోజు ఏకంగా రూ.23 మేర పెరిగి మధ్యాహ్నం 3.22 గంటల సమయానికి రూ.463 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం స్టాక్ 52 వారాల గరిష్ఠానికి దగ్గరగా ట్రేడ్ అవుతోంది. గత కొద్ది రోజులుగా షిప్పింగ్ కంపెనీ షేర్లలో విపరీతమైన జంప్ ఉంది. గత నెలలో ఈ షేరు 52.15% లాభపడింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 170 శాతానికి పైగా లాభపడింది.

గత సంవత్సరం IPOగా వచ్చి..

గత సంవత్సరం IPOగా వచ్చి..

KMEW షేర్ల లిస్టింగ్ మార్చి 22, 2021న జరిగింది. ఐపీవోలో కంపెనీ ఇష్యూ ధర కంటే 37 శాతం ఎక్కువకు షేర్ లిస్ట్ అయింది. ఈ IPO 09 మార్చి 2021న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడింది. అప్పట్లో దీని ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.37గా నిర్ణయించబడింది. అంటే.. ఇష్యూ ధరతో పోలిస్తే షేర్ ప్రస్తుతం దాదాపు 1000% కంటే ఎక్కువ లాభపడింది.

M- గ్రూప్ కింద ట్రేడింగ్..

M- గ్రూప్ కింద ట్రేడింగ్..

ప్రస్తుతం BSE SME ప్లాట్‌ఫారమ్‌లో M- గ్రూప్ కింద ఈ స్టాక్ ట్రేడింగ్ చేస్తోంది. ఎక్స్ఛేంజ్ SME ప్లాట్‌ఫారమ్ అధిక వృద్ధి సామర్థ్యం కలిగిన చిన్న, మధ్య తరహా కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

భారత ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ప్లేయర్‌ల కోసం మెరైన్ క్రాఫ్ట్‌ల యాజమాన్యం, నిర్వహణ కోసం 2015లో స్థాపించబడింది. సంస్థ వివిధ నౌకాశ్రయాల్లో డ్రెడ్జింగ్‌తో సహా అనేక రకాల మెరైన్ ఇంజనీరింగ్ పరిష్కారాలను అందిస్తోంది. ఇది నౌకాదళం, వాణిజ్య నౌకలకు మరమ్మతు సేవలను కూడా అందిస్తుంది. ఇది నౌకల నిర్వహణ, ఆపరేషన్ కోసం సాంకేతిక పరిష్కారాలను అందిస్తోంది.

 పెట్టుబడిపై రాబడి ఇలా..

పెట్టుబడిపై రాబడి ఇలా..

ఈ స్టాక్ లో ఇష్యూ సమయంలో ఏడాది కిందట లక్ష రూపాయులు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం.. రూ.12.50 లక్షల రాబడి వచ్చింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.470 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.41.80 గా ఉంది.

English summary

Rocket Stock: రాకెట్ లాగా దూసుకెళ్తున్న షిప్పింగ్ స్టాక్.. లక్షను ఏడాదిలో రూ.12.50 లక్షలుగా మార్చింది.. | Knowledge Marine & Engineering Works Ltd stock gave multibagger returns in just one year frm its ipo

this shipping stock gave multibagger returns know details
Story first published: Wednesday, August 3, 2022, 16:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X