PF: మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి..!
దేశంలో పని చేసే ఉద్యోగులందరికీ పీఎఫ్ ఖాత ఉంటుంది. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యుగులైనా పీఎఫ్ ఖాతా ఓపెన్ చేస్తారు. ఈ పీఎఫ్ ఖాతాకు ఉద్యోగి జీతం నుంచి కొంత.. యజమాని కొంత జమ చేస్తారు. కొన్ని సంస్థలు రెండు పీఎఫ్ లు ఉద్యోగి ఖాతా నుంచే కట్ చేస్తుంటారు. వీరిచ్చిన మొత్తానికి ప్రభుత్వం కూడా వడ్డీ చెల్లిస్తోంది. అయితే చాలా మంది ఉద్యోగులకు తమ పీఎఫ్ అకౌంట్ సంబంధించి సమాచారం సరిగా తెలియదు.
అయితే తమ ఖాతాలో ఎంత జమ అవుతుందో తెలుసుకోవాలి. అయితే చాలా మందికి తమ పీఎఫ్ ఖాతాలో ఎంత జమ అవుతున్నాయో తెలియదు. అందుకు రెగ్యులర్ గా పీఎఫ్ ఖాతా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దీని కోసం https://www.epfindia.gov.in/site_en/index.php వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అందులో ఎంప్లాయిస్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాస్ బుక్ చెక్ చేసుకోవచ్చు. అలకాకుండా మీ UANతో నమోదు చేసిన మొబైల్ నంబర్ నుండి 011-22901406కు కాల్ చేస్తే కూడా మీ పీఎఫ్ ఖాతాలో ఎంత అమౌంట్ ఉందో తెలుసుకోవచ్చు. రెండు రింగ్‌ల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది.

ఏ సమయంలోనైనా SMS. మీ నంబర్‌కి వస్తోంది. అందులో మీ పీఎఫ్ బ్యాలెన్స్, P.F. ఖాతాలో చివరిగా చెల్లించిన కంట్రిబ్యూషన్ వివరాలు ఉంటాయి. ప్లే స్టోర్ లో ఉమంగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో ఈపీఎఫ్ఓ టైప్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ కోసం యూఏఎన్ నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. అప్పుడు మీ పీఎఫ్ ఖాతా వస్తుంది.
అందులో మీ నెలనెలా చేసిన పొదుపు.. పెన్షన్ కంట్రీబ్యూషన్ చూపిస్తుంది. పీఎఫ్ ఖాతాదారులు ఎప్పటికప్పుడు పీఎఫ్ ఖాతా తనిఖీ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications