VI Stock: నేడు కుప్పకూలిన వొడఫోన్ ఐడియా స్టాక్.. కారణం ఏంటో తెలుసా..?
Vodafone Idea Shares: భారతీయ స్టాక్ మార్కెట్లు గడచిన కొద్దిరోజులుగా తిరిగి గాడిన పడుతున్నట్లు రికవరీని చూస్తున్నాయి. ఈక్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెన్నీ స్టాక్స్ వేటను తిరిగి మెుదలెడుతున్నారు. ఈ సమయంలో బ్లూచిప్ కంపెనీ షేర్లతో పాటు కరెక్షన్ తర్వాత తమ పెట్టుబడికి అనుకూలమైన స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ షేర్లను కొనేందుకు ఉన్న అవకాశాలను వారు పరిశీలిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఒకప్పుడు మెరిసిన టెలికాం దిగ్గజాల కలయిన అయిన వోడఫోన్ ఐడియా కంపెనీ షేర్ల గురించే. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు తమ డే గరిష్ఠం నుంచి దాదాపు 4 శాతం క్షీణతను నమోదు చేసింది. వాస్తవానికి టెలికాం కంపెనీ షేర్ల పతనానికి ఒక కారణం కూడా ఉంది. అదేటంటే కేంద్ర ప్రభుత్వం వొడఫోన్ ఐడియా సంస్థకు రూ.6090 కోట్ల బ్యాంక్ గ్యారెంటీల వ్యవహారంలో ఎలాంటి రిలీఫ్ అందించకపోవటమే.

వాస్తవానికి బ్యాంక్ గ్యారెంటీలను స్పెక్టమ్ కొనుగోళ్లకు ఇవ్వటం నుంచి ఉపశమనం లభించిందని టెలికాం కంపెనీ వీఐ భావించినప్పటికీ కేంద్రం నుంచి ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదని, ఎలాంటి ఊరట లభించలేదని వచ్చిన వార్తలతో నేడు ఇన్వెస్టర్లు ఆందోళనతో తమ షేర్లను విక్రయించటానికి ఎగబడ్డారు. వాస్తవానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం డిసెంబర్ 2024లో ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం టెలికాం సంస్థ కొన్ని షరతుల మేరకు 2012 నుంచి 2021 మధ్య స్పెక్ట్రమ్ చెల్లింపులకు బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.
దీంతో ప్రస్తుతం నేడు వోడఫోన్ ఐడియా కంపెనీ షేర్లు పతనానికి గురికావటంతో ఒక్కోటి ఇంట్రాడేలో రూ.7.27కి పడిపోయాయి. గడచిన ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్లు ఏకంగా 48 శాతం విలువను కోల్పోయాయి. అంటే తాజా వార్త ప్రకారం వొడఫోన్ ఐడియా తన గడచిన 5 స్పెక్ట్రమ్ చెల్లింపులకు ఇకపై బ్యాంక్ గ్యారెంటీలను అందించాల్సి ఉంటుందని తెలుస్తోంది. పైన పేర్కొన్న 2015 వేలానికి వాయిదా పడటానికి 13 నెలల ముందు ప్రతి స్పెక్ట్రమ్ వాయిదాకు వ్యతిరేకంగా వొడఫోన్ ఐడియా లిమిటెడ్ రూ. 24,800 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలను అందించాల్సి ఉంది.
వాస్తవానికి టెలికాం దిగ్గజంగా రిలయన్స్ జియో అవతరించటంతో ఒకప్పుడు వెలుగువెలిగిన బిర్లాలకు చెందిన ఐడియా కూడా కుప్పకూలింది. "బ్యాంక్ గ్యారెంటీ మాఫీతో, ప్రభుత్వం పరిశ్రమకు మద్దతును చూపించింది. మా దీర్ఘకాలిక నెట్‌వర్క్ విస్తరణ ప్రణాళిక అమలు కోసం రుణ నిధులను ముగించే దిశగా మేము కృషి చేస్తున్నాము" అని వోడాఫోన్ ఐడియా సీఈవో మూంద్రా ఫిబ్రవరి 12న పోస్ట్ ఎర్నింగ్స్ కాల్ చెప్పారు


Click it and Unblock the Notifications