Nandini Ghee Issue: తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వివాదం ప్రపంచ వ్యాప్తంగా ఆ గోవిందుడి భక్తులను మనోవేదనకు గురిచేస్తోంది. స్మామివారికి జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో ప్రసాదాన్ని వండి సమర్పించటారన్న విషయం తాజాగా నెయ్యి నాణ్యతా పరీక్షల్లో వెల్లడైంది. అయితే ఈ వివాదంతో ప్రస్తుతం గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై భక్తులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి కొనుగోలు చేసే కంపెనీని మార్చడమే ఇందుకు కారణమని ఆరోపణలు ఉన్నాయి. గత జూలైలో ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో అనేక అంశాల్లో నాణ్యత తగ్గించినట్లు భక్తుల నుంచి వచ్చిన ఆరోపణలపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలోనే నెయ్యి నాణ్యత విషయం తనిఖీల్లో బయటపడింది. తిరుమల లడ్డు ప్రపంచ గుర్తింపును సంతరించుకుంది. దాని నాణ్యత, రుచి, పవిత్రతకు కోట్లాదిమంది భక్తులు దాసోహం అని చెప్పుకోక తప్పదు. ఈ క్రమంలో తయారీలో వినియోగించే నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి కొనుగోలు చేసేందుకు వివిధ కంపెనీల నుంచి కాంట్రాక్టులు కోరుతోంది. ఇలా కాంట్రాక్టులు పొందిన కంపెనీల నుంచి లక్షల కిలోల్లో నెయ్యి కొనుగోలు చేస్తుంటుంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక పాల సహకార సంస్థ అయిన నందిని నుంచి నెయ్యి కొనుగోలు చేసేవారు. దాదాపు 15 ఏళ్లుగా తిరుపతి తిరుమల దేవస్థానానికి నందిని కంపెనీ నెయ్యి విక్రయిస్తోంది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ నందిని నుంచి నెయ్యి సేకరణను నిలిపివేసింది. ఎందుకంటే గతేడాది జరిగిన నెయ్యి కొనుగోళ్ల కాంట్రాక్ట్ పాయింట్‌లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని పాల్గొనలేదు.
దీనికి ప్రధాన కారణం నందిన్ బ్రాండ్ యజమాని KKMF గత సంవత్సరం దాని పాలు, నెయ్యి ధరలను పెంచబడింది. అయితే తక్కువ రేట్లకు నెయ్యి అందించలేమంటూ పక్కకు తప్పుకుంది. దీంతో కాంట్రాక్టును మరో కంపెనీకి వెళ్లింది. వైసీపీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం తిరుపతి దేవస్థానం పాలకవర్గాన్ని వేరే కంపెనీ నుండి నెయ్యి కొనుగోలు చేయాలని ఒత్తిడి చేసిందని కూడా చెప్పబడింది. ఈ పరిస్థితిలోనే గత జూన్‌లో నెయ్యి నాణ్యత తక్కువగా ఉందని దేవస్థానం యంత్రాంగం గుర్తించి జాతీయ ప్రయోగశాలకు పంపింది. సదరు నెయ్యిలో పంది కొవ్వు, చేప నూనె ఉన్నట్లు నేషనల్ లాబొరేటరీ నివేదించింది.
ఈ వ్యవహారంపై కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ భీమా నాయక్ కూడా స్పందించారు. నందిని మార్కెట్లో అంత్యంత నాణ్యమైన నెయ్యిని అందిస్తోందని వెల్లడించారు. ఏదైనా కంపెనీ నెయ్యి మా కంటే తక్కువ ధరకు అందజేస్తే అది నాసిరకం నాణ్యతతో కూడుకున్నదేనని ఆయన స్పష్టం చేశారు. మెుత్తానికి ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవటంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీనిపై గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా స్పందించారు. స్వామివారి ప్రసాదాల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాజకీయ అవసరాల కోసం దేవుడిని సైతం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications