Tax Filing: ఆర్థిక సంవత్సరం ముగియటంతో ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పన్ను పరిధిలోకి వచ్చేంత ఆదాయం కలిగి ఉన్న వారు మాత్రమే రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు. అయితే మీ ఆదాయం పన్ను పరిధిలోకి రానప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ITR ఫైల్ చేయడం మీ ఆదాయం, ఆర్థిక చరిత్రకు కీలకమైన రుజువుగా ఉపయోగపడుతుంది. జీవితంలో వివిధ అంశాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు ఎప్పుడైనా రుణం కోసం ఫైనాన్స్ సంస్థలను లేదా బ్యాంకుల వద్దకు వెళ్లినప్పుడు వారు తరచుగా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ డాక్యుమెంట్లను అడుగుతుంటారు. ఇవి ఫైనాన్స్ హిస్టరీకి రుజువుగా నిలుస్తూ సరసమైన వడ్డీ రేట్లకు లోన్స్ పొందేందుకు దోహదపడుతుంది.

హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్ వంటి వాటి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు.. ముందుగా రుణ సంస్థలు అడిగేది గత మూడు సంవత్సరాలుగా దాఖలు చేసిన పన్ను రిటర్స్ గురించే. ఇది మీ మీ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి అనుమతిస్తుంది. రుణాన్ని తిరిగి చెల్లించే మీ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. అలాగే మీరు వ్యాపార నష్టాలు లేదా పెట్టుబడుల మూలధన నష్టాలు వంటి నష్టాలను ఎదుర్కొన్నప్పుడు ITR ఫైల్ చేయడం చాలా ముఖ్యం.
నష్టాలు చెల్లించాల్సిన పన్ను బాధ్యతను తగ్గిస్తాయి. అలాగే వాటిని భవిష్యత్తు సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునేందుకు దోహదపడతాయి. ఈ ప్రయోజనాన్ని పొందేందుకు ITRను ఫైల్ చేయడం, ఈ నష్టాలను నిర్దేశిత గడువులోపు నివేదించడం అవసరం.
TDS రిఫండ్స్ పొందటానికి కూడా ITR ఫైల్ చేయటం తప్పనిసరి. మీరు పన్ను చెల్లించాల్సిన పరిధిలోకి రానప్పటికీ.. మూలం వద్ద పన్ను మినహాయింపులను ఎదుర్కోవచ్చు. వాటి రీఫండ్‌లను క్లెయిమ్ చేయాలన్నా టాక్స్ రిటర్న్స్ తప్పనిసరి. ITR ఫైల్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తే అది మీ విదేశాలకు వెళ్లే ప్రణాళికలకు ఆటంకం కలిగిస్తుంది.
ఇది వీసా ఆమోదం పొందే అవకాశాన్ని పెంచుతుంది. విదేశీ పెట్టుబడులు, అక్కడి బ్యాంకుల్లో ఖాతాలు లేదా ఆస్తులు ఉన్నట్లయితే అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల వివరాలతో రిటర్న్స్ ఫైల్ చేయాలి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్ ను జూలై 31, 2023లోపు దాఖలు చేయాలి లేకుంటే లేటు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications