Jio Financial: వరుసగా నాలుగో రోజు సైతం జియో ఫైనాన్షియల్ షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్ ను తాకాయి. స్టాక్ లిస్టయిన నాటి నుంచి వరుసగా పతనం కావటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంకెన్ని రోజులు ఇలా జరుగుతుంది..? అసలు ఎందుకిలా జరుగుతుందని ఆలోచనలో ఉన్నారు.
వివరాల్లోకి వెళితే నిఫ్టీ, సెన్సెక్స్ నుంచి నిష్క్రమణకు ముందే పాసివ్ ఫండ్స్ షేర్లను విక్రయిస్తున్నందున జియో ఫైనాన్షియల్ కంపెనీ షేర్లు వరుస పతనాన్ని నమోదు చేస్తున్నాయి. పాసివ్ ఫండ్స్ అనేవి ఇవి నిఫ్టీ లేదా సెన్సెక్స్ వంటి మార్కెట్ ఇండెక్స్‌ను ప్రతిబింబించే ఫండ్స్. ఈ సందర్భంలో నిఫ్టీ 50, సెన్సెక్స్ 30ని ప్రతిబింబించే అనేక ఇండెక్స్ ఫండ్‌లు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇండెక్స్‌లో భాగమైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను కలిగి ఉన్నందున.. జియో ఫైనాన్సియల్ షేర్లు అవి పొందాయి.

మార్చి 2023లో సర్క్యులర్ ప్రకారం ఎన్ఎస్ఈలో ఇండెక్స్ స్టాక్ విభజనకు గురైనప్పుడు.. విడిపోయిన ఎంటిటీ కూడా విడిగా జాబితా చేయబడే వరకు ఇండెక్స్‌లో భాగమవుతుంది. డీమెర్డ్ అయిన కంపెనీ షేర్ల లిస్టింగ్ తర్వాత మూడు రోజుల పాటు ఇండెక్స్‌లో కొనసాగి ఆ తర్వాత తీసివేయబడతాయి. అయితే మొదటి రెండు రోజులు సర్క్యూట్‌ను తాకినట్లయితే మినహాయింపు తేదీ వాయిదా వేయబడుతుంది. అయితే ఇక్కడ ట్రాకింగ్ లోపాన్ని నివారించేందుకు ఇండెక్స్ ఫండ్‌లు షేర్లను విక్రయిస్తున్నాయి.
ఈ కారణంగా మెుత్తం 145-150 మిలియన్ షేర్లు అవుట్‌ఫ్లో అవుతాయని నువామా ఆల్టర్నేటివ్ & క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఒక నోట్ తెలిపింది. ఇప్పటి వరకు ఆగస్టు 21న 78.3 మిలియన్ షేర్లు, ఆగస్టు 22న 7.8 మిలియన్ షేర్లు, ఆగస్టు 23న 4.7 మిలియన్ షేర్ల విక్రయం జరిగింది. అంటే మెుత్తంగా మూడు రోజుల్లో 90.8 మిలియన్ షేర్లను పాసివ్ ఫండ్స్ విక్రయించాయి. అంటే మరో 54-59 మిలియన్ షేర్ల విక్రయం మిగిలి ఉంది. దీని కారణంగా మిరికొన్ని రోజులు జియో ఫైనాన్షియల్ స్టాక్ నష్టాల్లో లాక్ అయి ఉంటుందని వెల్లడైంది. మెుత్తం విక్రయాలు జరిగిన తర్వాత స్టాక్ నిఫ్టీ, సెన్సెక్స్ నుంచి తొలగించబడుతుంది. JFS మొదటి రెండు రోజుల్లో సర్క్యూట్‌ను తాకింది కాబట్టి.. స్టాక్ మినహాయింపు వాయిదా పడింది. అందువల్ల ఆగస్ట్ 24కి బదులుగా.. ఇది ఇప్పుడు ఆగస్ట్ 29 నుంచి తీసివేయబడుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications