Trafiksol IPO: ఇటీవలి కాలంలో వరదలా వస్తున్న అనేక కంపెనీల ఐపీవోలతో చాలా జాగ్రత్తగా ఉండాలని సెబీ సైతం ఇటీవలి కాలంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీఎస్ఈ ఒక కంపెనీ ఐపీవోను వాయిదా వేయటంతో దలాల్ స్ట్రీట్ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. అనాలోచితంగా ఐపీవోలపై గుడ్డింగా బెట్టింగ్ వేస్తున్న ఇన్వెస్టర్లకు ఇది నిజంగా పెద్ద కనువిప్పని చెప్పుకోవచ్చు.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది సంచలనంగా మారిన ట్రాఫిక్సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. నేడు బీఎస్ఈ ఈ ఐపీవో లిస్టింగును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలను పరిష్కరించే వరకు వాయిదా వేసినట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ స్పష్టం చేసింది. అలాగే తాజా ఇష్యూ ద్వారా వచ్చిన డబ్బును కంపెనీ వినియోగించుకోవటానికి ప్రస్తుతం అనుమతి లేదని తేల్చి చెప్పింది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఈ ఐపీవోపై జాగ్రత్తగా మారిన బీఎస్ఈ చివరి నిమిషంలో నిధుల వినియోగాన్ని నిషేధించింది. వాస్తవానికి ఈ ఐపీవో నేడు మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది.

కంపెనీపై వచ్చిన ఫిర్యాదులు పరిష్కరింపబడే వరకు ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాలో జమచేయాలని బీఎస్ఈ ఆదేశించింది. వాస్తవానికి గ్రేమార్కెట్లో 135 శాతం ప్రీమియం పలకటంతో ఇన్వెస్టర్లు తొలిరోజునే మల్టీబ్యాగర్ రాబడులను ఆశించారు. కానీ లిస్టింగ్ పోస్ట్‌పోన్ చేసినట్లు వార్త వెలువడిన తర్వాత ప్రీమియం సున్నాకు పడిపోయింది. ఐపీవోలో బెట్టింగ్ వేసి షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్లు ప్రస్తుత పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు.
తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.44.87 కోట్లను సమీకరించాలని లక్ష్యంతో ఇష్యూని ప్రారంభించింది. దీనిలో భాగంగా పెట్టుబడిదారులకు సెప్టెంబర్ 10-12 వరకు సబ్‌స్క్రిప్షన్ అవకాశాన్ని కల్పించింది. ఇందుకోసం పూర్తిగా 64.10 లక్షల తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీ చేసింది. లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా ఉంచిన కంపెనీ ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.65-70గా ప్రకటించింది. మూడు రోజుల బిడ్డింగ్ సమయంలో ఇష్యూ మొత్తం 345.65 సార్లు సాలిడ్ సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. ఈ క్రమంలో రిటైల్ పోర్షన్ 317.66 రెట్లు, నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల భాగం దాదాపు 700 సార్లు, QIB భాగం 129.22 సార్లు బిడ్‌లను అందుకుంది. ఈ క్రమంలో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.12.75 కోట్లను అందుకుంది.
కంపెనీ వ్యాపారం..
ట్రాఫిక్సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ 2018లో స్థాపించబడింది. కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కన్సల్టింగ్ అండ్ డెలివరీ సేవలతో సహా సమగ్ర తెలివైన రవాణా వ్యవస్థలు, ఆటోమేషన్ సొల్యూషన్‌లను అందిస్తోంది. కంపెనీ అన్ని ప్లాట్‌ఫారమ్‌ల కోసం రెడీమేడ్ అనుకూలీకరించిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లు, బిజినెస్ అప్లికేషన్‌లు, కంప్యూటర్ గేమ్‌లను అందిస్తుంది. ట్రాఫిక్సోల్ అనేది అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, టోల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, టన్నెల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ వంటి అనేక రకాల ప్రాజెక్ట్‌లను నిర్వహించే ప్రత్యేక ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్ సేవలను అందిస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications