Pradeep Rathod: మారిపోతున్న వ్యాపార ముఖచిత్రంతో పాటుగా దేశంలో బిలియనీర్ల సంఖ్య రోజురోజుకూ పోరుగుతూనే ఉంది. ఒకపక్క స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు కంపెనీలను స్థాపిస్తూ యుక్త వయస్సులోనే సంపన్నులుగా మారుతుంటే మరోపక్క ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తున్న సాంప్రదాయ సంస్థల వ్యవస్థాపకులు సంపన్నులుగా మారిపోతున్నారు.
ఈ క్రమంలో కొత్తగా భారత బిలియనీర్ల జాబితాలో ప్రదీప్ రాథోడ్ అనే పేరు ప్రస్తుతం వచ్చి చేరింది. అసలు ఈయన ఎవరు..?? ఏ వ్యాపారం చేస్తుంటారు..?? వంటి అనేక ప్రశ్నలు ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. అసలు ప్రదీప్ పేరు ఇప్పుడే ఎందుకు వినికిడిలోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రజలు ఎక్కువగా వినియోగించే అనేక ఉత్పత్తులను తయారు చేసే కంపెనీ సెల్లో వరల్డ్ ఛైర్మన్ ప్రదీప్ రాథోడ్. ఇటీవల ఆయన కంపెనీ ఐపీవో మార్కెట్లోకి వచ్చింది. విజయవంతంగా ఐపీవో లిస్టింగ్ తర్వాత పెరిగిన సంపద కారణంగా ఆయన బిలియనీర్‌గా మారిపోయారు. ప్రస్తుతం ఆయన కంపెనీలో కలిగి ఉన్న 44 శాతం వాటా విలువ 1 బిలియన్ డాలర్ల మార్కును అందుకోవటంతో సంపన్నుల జాబితాలో చేరిపోయారు. దీంతో రాత్రికిరాత్రే ఆయన పేరు మారుమోగుతోంది. అలాగే ఆయన బడామియా చారిటబుల్ ట్రస్ట్‌కు ట్రస్టీగా కొనసాగుతున్నారు.
Cello World కంపెనీ కిచెన్ వేర్, థర్మోవేర్, పెన్నులు స్టేషనరీ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించటంలో దేశంలో ప్రఖ్యాతి గాంచింది. 2017లో గాజు, ఓపల్ ఉత్పత్తుల తయారీలోకి కంపెనీ విస్తరించింది. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ప్రదీప్ రాథోడ్ రూ.8,300 కోట్ల నికర విలువను కలిగి ఉన్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. కంపెనీని 1974లో గిసులాల్ రాథోడ్ స్థాపించారు. ప్రస్తుతం కంపెనీ డామన్, హరిద్వార్, బద్ది, చెన్నై, కలకత్తాలలో 13 తయారీ కేంద్రాలు ఉన్నాయి. FY23లో కంపెనీ నికర లాభం 30 శాతం పెరిగి రూ.285 కోట్లుగా నమోదైంది.
ప్రస్తుతం ప్రదీప్ రాథోడ్ కుమారుడు గౌరవ్, తమ్ముడు పంకజ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. అలాగే రాథోడ్ కుటుంబం Wim Plast Ltd ప్రమోటర్లుగా ఉన్నారు. ఇది సెల్లో బ్రాండ్ కింద అనేక ప్లాస్టిక్ ఫర్నిటర్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇది బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీ కూడా.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications