క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడిపోయారు. అయితే ధనశ్రీ వర్మకు ఈ విడాకులకి రూ.4.75 కోట్ల భరణం ఇచ్చేందుకు యుజ్వేంద్ర చాహల్ అంగీకరించారు. ఇందులో ఆయన ఇప్పటికే రూ.2.37 కోట్లు చెల్లించారు. ధనశ్రీ యుజ్వేంద్రను రూ.60 కోట్లు అడిగిందని చాలా నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ధనశ్రీ కుటుంబం ఈ వాదనలను ఖండించింది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐదు విడాకుల గురించి తెలుసుకుందాం...
బిల్ గేట్స్ అండ్ మెలిండా గేట్స్
ప్రపంచంలోని అగ్ర ధనవంతులలో ఒకరైన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అతని భార్య మెలిండా గేట్స్ పెళ్లి చేసుకొని 27 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 3 మే 2021న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ జంటకు చాల నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. ఈ విడాకుల ద్వారా మెలిండాకు $73 బిలియన్లు వచ్చాయని చెబుతున్నారు. అయితే ప్రపంచంలో ఇప్పటివరకు చూసిన అత్యంత ఖరీదైన విడాకులు ఇదే. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, విడాకుల తర్వాత మెలిండా గేట్స్ వివిధ కంపెనీలలో కనీసం $6.3 బిలియన్ల విలువైన షేర్స్ అందుకున్నారు.

జెఫ్ బెజోస్-మెకెంజీ స్కాట్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అతని భార్య మెకెంజీ స్టాక్ 2019లో విడాకులు తీసుకున్నారు. ఈ విడాకుల పై వార్తలు కూడా గుప్పుమన్నాయి. బెజోస్ తన భార్యకు విడాకులపై $38 బిలియన్లు ఇవ్వాల్సి వచ్చింది. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన విడాకులు. నేడు స్కాట్ $36.4 బిలియన్ల నికర విలువతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లిస్టులో 45వ స్థానంలో ఉన్నారు. బెజోస్ $214 బిలియన్ల నికర విలువతో ప్రపంచంలోనే రెండవ ధనవంతుడు.
అలెక్-జోస్లిన్ వైల్డెన్‌స్టెయిన్
ఫ్రెంచ్-అమెరికన్ వ్యాపారవేత్త & ఆర్ట్ డీలర్ అలెక్ వైల్డెన్‌స్టెయిన్ 21 సంవత్సరాల వివాహం తర్వాత 1999లో తన భార్య నుండి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీనికోసం, అతను తన భార్య జోసెలిన్ వైల్డెన్‌స్టెయిన్‌కు $3.8 బిలియన్ల భారీ భరణం చెల్లించాల్సి వచ్చింది. ఇది చరిత్రలో మూడవ అత్యంత ఖరీదైన విడాకులుగా పరిగణించబడుతుంది.
రూపెర్ట్ ముర్డాక్-మరియా టోర్వ్
మీడియా దిగ్గజం రూపర్ట్ ముర్డోక్, జర్నలిస్ట్ మరియా టోర్వ్ 31 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత 1998లో విడిపోతున్నట్లు ప్రకటించారు. దీని కోసం టోర్వ్ $1.7 బిలియన్లు అందుకున్నట్లు భావిస్తున్నారు. విడాకులు తీసుకున్న 17 రోజుల తర్వాత, ముర్డాక్ సిల్వర్ డెంగ్‌ను వివాహం చేసుకుంది, తర్వాత టోర్వ్ విలియం మాన్‌ను వివాహం చేసుకున్నారు.
స్టీవ్-ఏలియన్ విన్
అమెరికాలో లాస్ వెగాస్ క్యాసినో కింగ్ స్టీవ్ ఎల్లెన్ విన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి వివాహం 1963 నుండి 1986 వరకు కొనసాగింది, రెండవ వివాహం 1991 నుండి 2010 వరకు కొనసాగింది. రెండవ పెళ్లి తరువాత విడాకులు తీసుకున్న ఏలియన్ విన్ దాదాపు ఒక బిలియన్ డాలర్ల భరణం అందుకుందని సమాచారం. ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన ఐదవ అత్యంత ఖరీదైన విడాకులు ఇదే కూడా నమ్ముతారు.


Click it and Unblock the Notifications