Gold News: వాస్తవానికి గత ఏడాది చివరిలోనే నిపుణులు గోల్డ్ రేట్లు 2025లో ఎలా ఉంటాయనే తమ అంచనాలను పంచుకున్న సంగతి తెలిసిందే. పసిడి ధరలు ఔన్సుకు 3 వేల డాలర్ల స్థాయికి చేరుకుంటాయని అంచనా వేశారు. అయితే ఈ మార్కును అందుకోవటానికి ఎక్కువ సమయం అక్కర్లేదని ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.
వాస్తవానికి అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదల నుంచి యూఎస్ లేబర్ మార్కెట్ రిపోర్టు వరకు అనేక కారణాలు పసిడి ధరలను నిరంతరం ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 2900 డాలర్ల నుంచి 2950 డాలర్ల మధ్య తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. గడచిన వారంలో పసిడి ధరలు రెండు రోజులు భారీ పెరుగుదలను చూడగా.. రెండు రోజులు మాత్రం స్వల్ప ఊరటను అందించిన సంగతి తెలిసిందే. మెుత్తానికి గతవారం సగటున పసిడి ధరల పెరుగుదల భారతీయ వినియోగదారులను నిరుత్సాహపరిచింది. వివాహాది శుభకార్యాలు జరుగుతున్న వేళ రేట్ల పెరుగుదలతో అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

ఒక్కసారి ఫండ్‌మెంటల్ ఓవర్వ్యూ పరిశీలిస్తే.. గత గురువారం స్పాట్ గోల్డ్ 2,910 డాలర్ల పరిధిలో స్థిరంగా ఉండి. 2,891.27 డాలర్లకు దిగివచ్చినప్పటికీ కొనుగోలు దారులను ఆకర్షించింది. అనిశ్చితుల మధ్య రహ్యణ వ్యాహంలో భాగంగా కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరో పక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రపంచ దేశాలపై టారిఫ్ ప్రణాళికలపై ఆందోళనల ప్రభావం కూడా పసిడి ధరలపై కనిపిస్తోంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన అధికారంలోకి వచ్చినప్పుడు వాణిజ్య భాగస్వాములపై భారీ టాక్స్‌లను ప్రకటించగా మంగళవారం కెనడా, మెక్సికో నుండి వచ్చిన దిగుమతులపై 25% టాక్స్‌లను విధించారు. అలాగే ట్రంప్ బుధవారం ఆటోమేకర్లపై టారిఫ్స్‌ను ఒక నెల పాటు వాయిదా వేసారు.
అలాగే USMCA ఒప్పందం కింద ఉన్న వస్తువులపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్‌బామ్‌తో మాట్లాడిన తర్వాత ప్రకటించారు. అయితే ఈ ఒప్పందం ఏప్రిల్ 2 వరకు మాత్రమే అమలులో ఉంటుందని తెలుస్తోంది. పరస్పరం దీనిని గౌరవించాలని వారు నిర్ణయించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కానీ వాణిజ్య యుద్ధం పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. తద్వారా ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ట్రంప్ ప్రణాళికలు ఆర్థిక వృద్ధికి క్షీణతను, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రమాదాన్ని కలిగిస్తాయని, దీని వలన గ్రీన్బాక్ మరింత బలహీనపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
యూఎస్ ఉపాధి-సంబంధిత డేటా మిశ్రమంగా వచ్చింది. అమెరికా ఫిబ్రవరి నాన్‌ఫార్మ్ పేయ్రోల్స్ రిపోర్టును విడుదల చేయనుంది. దేశం 1,60,000 కొత్త ఉద్యోగాలను జారీ చేసినట్లు అంచనా వేయబడుతోంది. నిరుద్యోగ రేటు 4% వద్ద స్థిరంగా ఉండే అవకాశం ఉంది. మెుత్తానికి పసిడి ధరలు రానున్న వారంలో కూడా పెరుగుదలకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని స్పాట్ మార్కెట్లు సంకేతాలను ఇస్తున్నాయి.
నేడు తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8040గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.87771 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,000 పెరిగి రూ.1,08,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications