Mutual Funds: ఏడాది చివర దగ్గర పడుతోంది. ఈ క్రమంలో చాలా మంది కొత్త సంవత్సరం ఆర్థిక ప్లానింగ్, కొత్త పెట్టుబడి ఆలోచనలు చేస్తుంటారు. అయితే మెుత్తం డబ్బును ఈక్విటీల్లో పాటు ఇతర మార్గాల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్‌పై దృష్టి సారిస్తున్నారు.
ముందుగా ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి అనే ప్రశ్నకు సమాధానం ఆలస్యం చేయకూడదు అని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యం చేయటం వల్ల సంపద సృష్టి తగ్గుతుందని, పెట్టుబడి వ్యవధి తగ్గడం కాంపౌండింగ్ ప్రయోజనాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వయస్సులోనే పెట్టుబడులను ప్రారంభించటం వల్ల రిటైర్మెంట్ సమయానికి ఎక్కువ మెుత్తాన్ని పొందవచ్చు. అందువల్ల పెట్టుబడుల విషయంలో ఆలస్యం అస్సలు సరైనది కాదు.

పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన రెండవ విషయం సరైన ఆస్థిని పెట్టుబడి కోసం ఎంచుకోవటం. అది మార్కెట్ ఓలటాలిటీని తట్టుకుంటూ తక్కువ రిస్క్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మీరు కింగ్ ఫిషర్ కంపెనీ షేర్లను పరిశీలిస్తే.. 2006లో రూ.76 వద్ద ఉన్న షేర్ ధర 2007లో దాదాపుగా రూ.300 కంటే పైకి పెరిగింది. ఆ తర్వాత భారీగా క్షీణించింది. ఆ తర్వాత కంపెనీ షేర్ స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి డీలిస్ట్ కావటంతో పెట్టుబడిదారులు భారీగా నష్టపోయారు. అలాగే రిలయన్స్ ఇండస్టీస్ షేర్లను కొన్న ఇన్వెస్టర్ల సంపద పెరిగింది. అందుకే సరైన పెట్టుబడి ఎంపిక చాలా కీలకం.
పెట్టుబడుల విషయంలో అత్యంత ముఖ్యమైన మూడో విషయం ఏమిటంటే.. క్రమం తప్పకుండా, శ్రద్ధగా పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారు మార్కెట్ల అస్థిరతలను కొంత పక్కన పెట్టి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా నిర్ణీత మెుత్తాన్ని క్రమంగా దాచుకోవటం ద్వారా మంచి రాబడులను పొందుతారు. ఎందుకంటే మార్కెట్లు తగ్గినప్పుడు మీరు ఎక్కువ యూనిట్లను పొందుతారు. మార్కెట్లు పెరిగినప్పుడు మీరు తక్కువ యూనిట్లను పొందుతారు. మెుత్తానికి స్థిరమైన వృద్ధిని పొందేందుకు మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీలు ఉత్తమంగా పనిచేస్తాయి. పైగా ఈ డబ్బును నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతుంటాయి.
ఇన్వెస్టర్లకు అన్నింటి కంటే ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం ఓపిక, క్రమశిక్షణ. దీనికి అతిపెద్ద ఉదాహరణ ఏమిటంటే రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు. అలాగే సంపదను సృష్టించటానికి పెట్టుబడిదారులకు ముఖ్యంగా ఓర్పు, క్రమశిక్షణ తప్పనిసరి. దీర్ఘకాలంలో మార్కెట్లు స్థిరమైన రాబడులను అందిస్తాయని నిపుణులు, విజయవంతమైన స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటారు.
దీని ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి సరైన సమయం అంటూ ఉండదు. మార్కెట్లు పెరుగుతున్నా లేదా పడిపోతున్నా క్రమపద్ధతిలో నిర్థిష్ట మెుత్తాలను పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించటమే సరైనది. అందుకే పెట్టుబడులను వెంటనే ప్రారంభించటం ఉత్తమమైనదిగా నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications