Akasa Air: జున్‌జున్‌వాలా విమాన సంస్థకు మెుదలైన కష్టాలు.. ఏం జరిగిందంటే..??
Akasa Air: దేశంలో తక్కువ బడ్జెట్ విమాన సంస్థగా గత ఏడాది ఆకాశ ఎయిర్ అడుగు పెట్టింది. ఇది దివంగత స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ జున్‌జున్‌వాలా స్థాపించిన కంపెనీ. అయితే ప్రస్తుతం కంపెనీకి ఊహించని చిక్కులు మెుదలయ్యాయి.
వివరాల్లోకి వెళితే ఆకాశ విమాన సంస్థకు 43 మంది పైలట్లు ఝలక్ ఇచ్చారు. రాజీనామా చేసిన తర్వాత 6 నెలల నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుండా అకస్మాత్తుగా విధుల నుంచి తప్పుకున్నారు. దీంతో కంపెనీ వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. పైలట్లు తమ ఒప్పందం ప్రకారం తప్పనిసరి నోటీసు కాలాన్ని పూర్తి చేసే వరకు మరో విమాన సంస్థలో చేరకుండా నిరోధించాలని తన పిటిషన్‌లో పేర్కొంది.

విధులను విడిచిపెట్టి.. తప్పనిసరి కాంట్రాక్టు నోటీసు వ్యవధిని అందించకుండా వెళ్లిపోయిన చిన్న పైలట్‌లపై మాత్రమే చట్టపరమైన పరిష్కారాన్ని కోరినట్లు ఆకాశ ఎయిర్ ప్రతినిధి తెలిపారు. పైలట్లు తాజా చర్యల ద్వారా వారి ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా దేశ పౌర విమానయానాన్ని కూడా ఉల్లంఘించారని పేర్కొన్నారు. వీరు చేసిన చర్యల కారణంగా ఆగస్టులో విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని, చివరి నిమిషాల్లో విమానాల రద్దు చేయాల్సి రావటం వల్ల వేల మంది కస్టమర్లు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
కొత్తగా దేశీయ విమాన రంగంలోకి ప్రవేశించిన ఆకాశ ఎయిర్ ఆగస్టులో ఎదుర్కొన్న సమస్యల కారణంగా జూలైలో 5.2 శాతంగా ఉన్న మార్కెట్ వాటా తర్వాత నెలలో 4.2 శాతానికి పడిపోయింది. గత కొన్ని నెలలుగా ప్రత్యర్థి కంపెనీల్లో చేరేందుకు కొంత మంది పైలట్లు అకాశను వీడుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో స్పైస్‌జెట్ కంటే ముందు దూసుకుపోయి.. జూలైలో దాని ఆధిక్యాన్ని కొనసాగించింది. అయితే ఆగస్ట్‌లో ఎయిర్‌లైన్ మార్కెట్ వాటా తడబడటంతో 5,27,000 మంది ప్రయాణీకులను రవాణా చేయగలిగిందని గణాంకాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications