Investment News: శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ బుల్ ర్యాలీని చూసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి భారత ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం జీవితకాల గరిష్ఠాల వద్ద కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే బడ్జెట్ తర్వాత ఎక్కడ పెట్టుబడులు కొనసాగించాలనే ఆందోళనలు, గందరగోళం చాలా మంది భారతీయ ఇన్వెస్టర్లను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.
ఈ క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఏంజెల్ వన్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమర్ డియో సింగ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ తర్వాత ఏఏ రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు ఎలా ఉండనుంది వంటి విషయలపై స్పందించారు. ఇది వాస్తవానికి గందరగోళంలో ఉన్న లక్షలాధిమంది ఇన్వెస్టర్లకు మార్గనిర్ధేశకం చేయవచ్చు. సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు వారికి క్లారిటీ ఇవ్వవచ్చని తెలుస్తోంది.

బడ్జెట్ 2024 సమాజంలో ఉద్యోగాల కొరత, తగ్గుతున్న డిమాండ్ వంటి కీలక అంశాలపై ఆసారి దృష్టి సారించిందని డియో సింగ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బడ్జెట్ అగ్రికల్చర్ రంగం, అఫోర్డబుల్ హౌసింగ్, స్కిల్లింగ్, ఉద్యోగాల కల్పనకు ప్రోత్సాహకాలను అందించే దిశగా సాగింది. ఇది కోట్ల మంది మధ్యతరగతి ఆదాయ బ్రాకెట్ ఫ్యామెలీల సమస్యలకు కొంత పరిష్కారాన్ని అందించనుందని తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ ఎఫ్ఎంసీజీ, ఇన్ ఫ్రా, మ్యానుఫ్యాక్చరింగ్, హౌసింగ్, అగ్రి, పవర్ సెక్టార్ ప్రధానంగా లాభపడవచ్చని సింగ్ అంచనా వేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్, ఎనర్జీ, రైల్వే, డిఫెన్స్, బ్యాంకింగ్ సహా మరిన్ని రంగాలు మంచి ఆర్డర్ బుక్ చూడవచ్చని తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు, తయారీ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించడం PSUలకు పరివర్తన ప్రయాణంలో గణనీయంగా సహాయపడింది. మేక్-ఇన్-ఇండియాపై దృష్టి పెట్టడం కూడా వృద్ధికి తోడ్పడింది. హైవేలు, పవర్, ఓడరేవులు, విమానాశ్రయాల నిర్మాణ పరంగా మౌలిక సదుపాయాలపై ఒత్తిడి కూడా PSU ప్యాక్‌కి సహాయపడింది.
ప్రస్తుతం దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతున్న వేళ పెట్టుబడికి ఇప్పటికీ ఆకర్షనీయమైన రంగాల జాబితాలో ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, ఇన్‌ఫ్రా, హౌసింగ్ వంటివి కొనసాగుతున్నాయని సింగ్ పేర్కొన్నారు. అలాగే భారతీయ ఈక్విటీలు, మొత్తం ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలికంగా మంచి పనితీరును కనబరుస్తుందని అంచనా వేశారు. బెంచ్‌మార్క్ సూచీల గత చారిత్రక రాబడిని బట్టి చూస్తే, గత రెండు దశాబ్దాలుగా CAGR 14-15 శాతం వార్షిక రాబడికి దగ్గరగా ఉందని, ఇది ఈక్విటీలు ఇతర అసెట్ క్లాస్‌లను అధిగమించాయని అన్నారు.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇవి పూర్తిగా బ్రోకరేజ్ వ్యక్తిగత అభిప్రాయం. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడులు చేయకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీలు వంటి పెట్టుబడులు భారీ నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications