Stock Market: ఈ వారం మార్కెట్లకు చాలా కీలక అంశాలు గమ్యాన్ని నిర్ధేశించనున్నాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కొన్ని పరిణామాలు భారత స్టాక్ మార్కెట్లను ఎలా ప్రభావితం చేస్తాయో ఒక్కసారి తెలుసుకోవటం చాలా ముఖ్యం.

మార్కెట్ల దశ దిశ..
స్టాక్ మార్కెట్ల దిశను ఈ వారం అనేక స్థూల ఆర్థిక డేటా, గ్లోబల్ ట్రెండ్ ప్రకటనలు నిర్ణయిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూలైకి సంబంధించిన పారిశ్రామికోత్పత్తి (IIP) గణాంకాలు ఈ వారం రానున్నాయి. అదే సమయంలో టోకు ధరల సూచిక ఆధారంగా ద్రవ్యోల్బణం తాజా డేటా బుధవారం విడుదలవుతుంది.

జియోజిత్ అభిప్రాయం..
ఈ వారం మార్కెట్ దిశను ప్రపంచ మార్కెట్ ట్రెండ్‌లతో పాటు కొన్ని ముఖ్యమైన స్థూల ఆర్థిక డేటా ద్వారా నిర్ణయించబడుతుంది. అయితే ద్రవ్యోల్బణం కాకుండా, తయారీ, పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలు చాలా కీలకమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. వీటికితోడు విదేశీ నిధులు లేదా పెట్టుబడుల ప్రవాహం, డాలర్‌తో రూపాయి మారకపు అస్థిరత కూడా మార్కెట్ పాయింట్ నుండి ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

శామ్‌కో సెక్యూరిటీస్ మాట..
అమెరికా ద్రవ్యోల్బణం డేటా కోసం ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని శామ్‌కో సెక్యూరిటీస్‌కు చెందిన మార్కెట్ పెర్స్పెక్టివ్స్ హెడ్ అపూర్వ సేథ్ అన్నారు. అందరి దృష్టి అగ్రహాజ్యం గణాంకాలపైనే ఉంటుందని పేర్కొన్నారు. ఎందుకంటే దీని ఆధారంగానే ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్తు ట్రెండ్ ఎలా ఉంటుందో తెలుస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఫెడ్ దూకుడును వీటి ద్వారా అంచనావేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

గత వారం మార్కెట్ సెంటిమెంట్..
గడచిన వారం BSE సూచీ సెన్సెక్స్ 989.81 పాయింట్లు లేదా 1.68 శాతం పెరిగింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 293.90 పాయింట్లు లాభపడి 1.67 శాతానికి చేరుకుంది. ప్రస్తుతానికి మార్కెట్లలో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతుందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మార్కెట్‌లో విస్తృతంగా కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోందన్నారు. అయితే రానున్న వారం ఈ జోరు కొనసాగుతుందా అనే విషయం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.

మార్కెట్లు క్రాష్ అయ్యే ఛాన్స్..!
తాజాగా రష్యా యూరోపియన్ దేశాలకు గ్యాస్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసింది. దీనివల్ల అక్కడ ద్రవ్యోల్బణం భారీగా పెరగనుంది. ఉక్రెయిన్ విషయంలో ఐరోపా దేశాల తీరుకు వ్యతిరేకంగా రష్యా ఈ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ముదిరితే ఆ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై స్వల్పకాలం ఉన్నప్పటికీ ఎక్కువ నష్టాన్ని కలిగించవచ్చని అంచనాలు చెబుతున్నాయి. కాబట్టి వారం ప్రారంభంలో మార్కెట్లు నష్టాల్లో లేదా తీవ్ర ఓలటాలిటీలో అవ్వొచ్చని తెలుస్తోంది.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్‌లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications